ర్యాగింగ్‌తో విలువలు పతనం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : విద్యార్థులు ర్యాగింగ్ వల్ల విలువలను కోల్పోతారని జేఎన్‌టీయూ వీసీ సర్కార్ అన్నారు. ర్యాగింగ్ నిరోధంపై ఆదివారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల విద్యార్థుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయని, క్రమశిక్షణ క్షీణించి విద్య నశిస్తుందని చెప్పారు.
ఇంజినీరింగ్ అనంతరం ఉద్యోగ అవకాశాలను వివరిస్తూ ప్రతి విద్యార్థీ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ క్రిష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపాల్ దేవకుమార్, వివిధ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.