vc sarkar
-
ర్యాగింగ్‌తో విలువలు పతనం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : విద్యార్థులు ర్యాగింగ్ వల్ల విలువలను కోల్పోతారని జేఎన్టీయూ వీసీ సర్కార్ అన్నారు. ర్యాగింగ్ నిరోధంపై ఆదివారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల విద్యార్థుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయని, క్రమశిక్షణ క్షీణించి విద్య నశిస్తుందని చెప్పారు. ఇంజినీరింగ్ అనంతరం ఉద్యోగ అవకాశాలను వివరిస్తూ ప్రతి విద్యార్థీ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ క్రిష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపాల్ దేవకుమార్, వివిధ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ పురోగతికి కృషి
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పురోగతికి కషి చేస్తామని వీసీ ఆచార్య ఎం.సర్కార్ అన్నారు. జేఎన్టీయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీసీ మాట్లాడుతూ సమష్టి కషితోనే అభివద్ధి సాధ్యమన్నారు. రూ.72 కోట్లతో నాలుగు అధునాతన భవనాల నిర్మాణాలను త్వరలో చేపడతామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య కష్ణయ్య, ఆచార్య దుర్గాప్రసాద్, నాన్‌టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక ఇంజినీర్లుగా ఎదగాలి
జేఎన్టీయూ : ఇంజినీరింగ్ పూర్తయిన ప్రతి ఒక్కరూ దేశ పురోగతికి దోహదపడి, సామాజిక ఇంజినీర్లుగా ఖ్యాతి దక్కించుకోవాలని జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ పేర్కొన్నారు. గురువారం జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అధ్యయ నం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందచేశారు. జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య పాండురంగడు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ప్రిన్సిపల్ ఆచార్య బి. ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఎంఎల్ఎస్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.