జేఎన్‌టీయూ: ఎంటెక్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీపీజీఈసెట్–2017 సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగియనుంది. గేట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు. ఇప్పటిదాకా జేఎన్‌టీయూ(అనంతపురం) హెల్ప్‌లైన్ సెంటర్‌లో 2,034 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు.