8 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ | Mset Counseling from 8th | Sakshi
Sakshi News home page

8 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

Published Tue, Jun 6 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

Mset Counseling from 8th

  •  17వతేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన
  • ఎస్కేయూ, పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండు హెల్ప్‌లైన్‌ కేంద్రాలు
  • ఎస్టీ విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ కేంద్రం కేటాయింపు
  • క్యాంప్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సి.కేశవ చంద్ర రావు వెల్లడి
  •  

    జేఎన్‌టీయూ :

    ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు కౌన్సెలింగ్‌ క్యాంపు ఆఫీసర్‌ డాక్టర్‌ సి. కేశవచంద్రరావు పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ వివరాలు వెల్లడించారు. ఈనెల 8 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (అనంతపురం), ఎస్కేయూలో రెండు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 11 నుంచి 19, 20తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు.ఈనెల 21,22 తేదీల్లో వెబ్‌ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. 25న సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తమ వెంట తీసుకురావాలన్నారు. నిర్దేశించిన హెల్ప్‌లైన్‌ సెంటర్లలోనే ఆయా ర్యాంకుల వారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.

    నిర్దేశించిన కౌన్సెలింగ్‌ కేంద్రాలు - ర్యాంకులవారీగా హాజరుకావాల్సిన వారి వివరాలు :

    తేదీ               ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అనంతపురం      ఎస్కేయూ

    08               1–4,000 ర్యాంకు                      4001–8,000

    09                8001–12,000                                 12001–16,000

    10           16001–23,000                                23001–30,000

    11                30001–37,500                               37,501–45,000

    12                45001–52,500                               52,501–60,000

    13                60,001 –69,000                      69001–78,000

    14                78,001–86,500                               86501–95,000

    15                95001–10,5000                              10,5001–1,15,000

    16                1,15,001–1,22,500                   1,22,501–1,30,000

    17                1,30,001–1,37,500                   1,37,501– చివరి ర్యాంకు వరకు

     

    • ఎస్టీ కేటగిరి విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. మిగిలిన అందరూ ఎస్కేయూలో ఏర్పాటు చేసిన రెండు హెల్ప్‌లైన్‌ సెంటర్లలో హాజరుకావాల్సి ఉంటుంది.
    • ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్, చైల్డ్‌ఆర్మ్‌డ్‌ పర్సన్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, విజయవాడ హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో హాజరుకావాల్సి ఉంటుంది.

    ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకుంటే :   ఆదాయ ధ్రువీకరణ పత్రం లేనట్లయితే తెల్లరేషన్‌ కార్డు వెంట తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇదేవిధంగా కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తు చేసుకొని రాని విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ)ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ తరువాత అందించాల్సి ఉంటుంది.

    కౌన్సెలింగ్‌కు విద్యార్థితో పాటు పేరెంట్స్‌ అవసరమా?

      కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థులు వెంట పేరెంట్‌ ఉంటే మంచిదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అమ్మాయిలు తప్పనిసరిగా పేరెంట్స్‌ను పిలుచుకొని రావాలని అధికారులు చెప్తున్నారు.

    ప్రాసెసింగ్‌ ఫీజు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో :

    విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు http://apeamcet.nic.in అనే వెబ్‌సైట్‌లో క్రెడిట్‌కార్డు /డెబిట్‌ కార్డు /ఇంటెర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి.

    •  హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో  ప్రాసెసింగ్‌ ఫీజు నగదు రూపంలో తీసుకోబడదు. నిర్ధేశించిన ర్యాంకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఎప్పుడుంటుందో.. ముందు రోజు ప్రాసెసింగ్‌ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
    • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో విద్యార్థులు ఇచ్చే మొబైల్‌ నంబర్‌ మార్పు చేయరాదు. యూసర్‌ ఐడీ– పాస్‌ వర్డ్‌ను ఎవరికీ ఇవ్వకూడదు.
    • విద్యార్థుల మెయిల్‌కు, మొబైల్‌కు వచ్చే ఐసీఆర్‌ ఫాం భద్రపరుచుకోవాలి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement