విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
ఇంజినీరింగ్ కళాశాలలు బకాయిలు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం అన్యాయమని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌టీయూ అధికారుల వైఖరికి నిరసనగా బుధవారం రిజిస్ట్రార్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
వైఎస్సార్ విద్యార్థి విభాగం
జేఎన్‌టీయూ: ఇంజినీరింగ్ కళాశాలలు బకాయిలు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం అన్యాయమని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌టీయూ అధికారుల వైఖరికి నిరసనగా బుధవారం రిజిస్ట్రార్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. ఎస్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల (నెల్లూరు) రూ. 19 లక్షలు యూనివర్సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ (యూసీఎఫ్) చెల్లించలేదని ఆ కళాశాలకు చెందిన విద్యార్థుల సర్టిఫికెట్లు పంపకుండా నిలిపివేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం తగదన్నారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ కృష్ణయ్య హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ శెట్టి, ఎస్కేయూ అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తులసీ రెడ్డి, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.