ఈసెట్–2017 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
అర్హత సాధించిన వారు 91.79 శాతం మంది
సాక్షి, హైదరాబాద్: ఈసెట్–2017 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం సాయంత్రం జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో సెట్ కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 6న జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 25,139 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 24,458 మంది పరీక్షకు హాజరవగా.. 22,450 మంది (91.79 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
అర్హత సాధించిన వారిలో 16,859 మంది బాలురు.. 5,591 మంది బాలికలు ఉన్నారు. ఈసెట్ పరీక్షను జేఎన్‌టీయూ తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించింది. అయితే అధికారులు, పరీక్ష నిర్వహణ ఏజెన్సీ మధ్య సమన్వయ లోపంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.