పీహెచ్‌డీతో ఉజ్వల భవిత | jntu phd notification | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీతో ఉజ్వల భవిత

Published Sat, Jan 21 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

పీహెచ్‌డీతో ఉజ్వల భవిత

పీహెచ్‌డీతో ఉజ్వల భవిత

- జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
- ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం.. ఫిబ్రవరి 11 చివరి గడువు
- రిజర్వేషన్ల వారీగా సీట్ల భర్తీ


జేఎన్‌టీయూ : కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని తపించే వారికి పరిశోధన రంగంలో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. సాంకేతిక రంగంలో అయితే మరీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతటి గొప్ప లక్ష్యాలు లేకున్నా పీహెచ్‌డీ పూర్తయితే ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫ్యాకల్టీగా పని చేసేవారికి రెట్టింపు జీతం ఇస్తున్నారు. దీంతో చాలామంది అభ్యర్థులు జేఎన్‌టీయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. నోటిఫికేషన్‌ పడినప్పుడల్లా 4వేల నుంచి 5వేల మంది వరకూ ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. వర్శిటీ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూనే వస్తోంది.

ఈ ఏడాది కూడా జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల, అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని రీసెర్చ్‌ సెంటర్లలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎక్స్‌టర్నల్, పార్ట్‌టైం పీహెచ్‌డీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎక్స్‌టర్నల్‌ పీహెచ్‌డీ, 23 అనుబంధ రీసెర్చ్‌ సెంటర్లలో ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 11వ తేదీ చివరి గడువుగా నిర్ధేశించారు. దరఖాస్తు రుసుము రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన తర్వాత వచ్చే రసీదును ‘ద డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, జేఎన్‌టీ యూనివర్సిటీ, అనంతపురం’ పేరు మీద రిజిస్టర్‌ పోస్ట్‌లోనో, కొరియర్లోనో పంపవచ్చు. ఎక్స్‌టర్నల్, ఫుల్‌ టైం పీహెచ్‌డీలకు వేర్వేరు దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు కాల వ్యవధి
- పుల్‌టైం పీహెచ్‌డీ కోర్సు కాల వ్యవధి కనీసం మూడు సంవత్సరాలు. ఆరు సంవత్సరాల్లోపు కోర్సు పూర్తి చేయాలి.
- ఎక్స్‌టర్నల్‌ పీహెచ్‌డీ కోర్సు కాల వ్యవధి కనీసం నాలుగు సంవత్సరాలు. ఎనిమిది సంవత్సరాల్లో పూర్తి చేయాలి.
- ఎక్స్‌టర్నల్‌ ఎంఫిల్‌, ఎంఎస్‌ కోర్సుల కాల వ్యవధి కనీసం రెండేళ్లు. నాలుగేళ్లలో పూర్తి చేయాలి.

ఫీజు వివరాలు :
అడ్మిషన్‌ పొందిన వారు ప్రతి సెమిస్టర్‌కు రూ.20 వేలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఇవి కాక ప్రి-సబ్‌మిషన్‌ సెమినార్‌కు రూ.7,500, మూడు దఫాలు ప్లాగరిజమ్‌ చెక్‌కు రూ.3వేలు, థీసిస్‌ సబ్‌మిషన్‌కు రూ.10 వేలు ఫీజులుగా నిర్ధేశించారు.

అభ్యర్థుల ఎంపిక ఇలా
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 60 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించారు. సీఎస్‌ఐఆర్‌, జేఆర్‌ఎఫ్‌ (యూజీసీ), నెట్, స్లెట్, సెట్, గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉండదు. వారు నేరుగా ఇంటర్వ్యూకు రావచ్చు. దూరవిద్య ద్వారా ఎంఫిల్‌ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలో అవకాశం కల్పించరు. ఇంటర్వ్యూలో ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేస్తారు.

పీహెచ్‌డీ కోర్సుకు అర్హతలు
- ఎంటెక్, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్సెస్‌), ఎంసీఏ, ఫార్మాడి పూర్తి చేసిన వారు ఫార్మసీలో పరిశోధన చేయవచ్చు.
- ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలో పరిశోధన చేయాలనుకునేవారు ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, హోమ్‌ సైన్సెస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్‌ టెక్నాలజీ, పుడ్‌ సైన్సెస్, న్యూట్రీషన్, వెటర్నరీ సైన్సెస్‌) పూర్తిచేసిన వారు, ఎంటెక్‌ (బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్, డైరీ టెక్నాలజీ ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంఫిల్‌లో కేవలం మేథమేటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
- ఎంఎస్‌ ప్రోగ్రాం సివిల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్సెస్, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో 5 సీట్ల చొప్పున కేటాయించారు.

ఎక్స్‌టర్నల్‌ పీహెచ్‌డీ సీట్ల వివరాలు రిజర్వేషన్‌ వారీగా...
విభాగం    సీట్లు     ఓసీ    బీసీ - ఏ    బీసీ - బీ    బీసీ - సీ    బీసీ - డీ    బీసీ - ఈ    ఎస్సీ      ఎస్టీ    
సివిల్‌    25    13    01    03    00    02    01    03    02    
ఈఈఈ    25    13    01    03    00    02    01    04    01    
మెకానికల్‌    25    12    02    02    00    02    01    04    02    
ఈసీఈ    25    12    02    02    01    01    01    04    02    
సీఎస్‌ఈ    25    13    02    02    00    02    01    04    01    
కెమికల్‌     05    02    01    01    00    00    00    00    01    
ఫార్మసీ    20    10    01    02    01    01    01    03    01    
మేథమేటిక్స్‌    15    08    01    01    00    01    01    02    01    
ఫిజిక్స్‌     10    05    01    01    00    00    01    01    01    
కెమిస్ట్రీ    10    05    00    01    00    01    01    02    00    
ఇంగ్లీష్‌     10    05    01    01    00    01    00    02    00    
మేనేజ్‌మెంట్‌    10    05    01    01    00    01    00    01    01    
బయోటెక్‌    05    03    01    01    00    00    00    01    00    
ఫుడ్‌టెక్‌    05    02    00    01    00    01    00    01    00    
మొత్తం     215    108    15    22    02    15    09    32    13    

పుల్‌టైం పీహెచ్‌డీ సీట్ల వివరాలు రిజర్వేషన్‌ కేటగిరి వారీగా...
సివిల్‌     03    01                    01    01        
ఈఈఈ    07    03    01    01                01    01    
మెకానికల్‌ ఇంజినీరింగ్‌     16    08    01    02    00    01    01    02    01    
ఈసీఈ    14    07    01    01    00    01    01    02    01    
సీఎస్‌ఈ    07    04    00    01    00    01    00    00    01    
ఫార్మసీ    36    18    03    04    01    02    01    05    02    
కెమిస్ట్రీ    01    01                                
ఇంగ్లీష్‌    01    01                                
మేనేజ్‌మెంట్‌    06    03    00    01    00    01    00    01    00    
మొత్తం    98    49    07    10    01    07    04    14    6   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement