phd notification
-
ఓయూలో పీహెచ్డీ పర్యవేక్షణకు ప్రొఫెసర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పర్యవేక్షణకు (గైడ్) ప్రొఫెసర్ల తీవ్ర కొరత నెలకొంది. గత 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల సంఖ్య 1254 నుంచి 362కు తగ్గింది. తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి బోధనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 362 మంది పర్మనెంట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఓయూ పరిధిలోని ఐదు జిల్లాల పీజీ కేంద్రాలను కాంట్రాక్టు అధ్యాపకులతోనే నిర్వహిస్తున్నారు. ఓయూలో కాంట్రాక్టు 430, పార్టుటైం అధ్యాపకులు 260 మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతో పాటు సుమారు 200 మంది పర్మనెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ గైడ్షిప్ అర్హత లేదు. గైడ్షిప్ గల 162 మంది పర్మనెంట్ అధ్యాపకుల వద్ద గతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీలో కొనసాగుతుండగా కొత్త వారికి అవకాశం దక్కడం లేదు. ఆరేళ్ల తర్వాత.. ఓయూలో ఆరు సంవత్సరాల తర్వత పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఆరేళ్లలో ఓయూనే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 50 వేలకు పైగా ఉండగా ఇతర వర్సిటీలకు చెందిన వారు మరో 15 వేల మంది ఉన్నారు. గతంలో ఓయూలో 1254 పర్మనెంట్ అధ్యాపకులు పనిచేయగా వారిలో సగం మందికి పీహెచ్డీ గైడ్షిప్ అర్హత ఉండేది. ఒక్క అధ్యాపకుని వద్ద 8 మంది విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. దీంతో ఏటా పార్ట్‌టైం, ఫుల్‌టైం పీహెచ్‌డీలో సుమారు 4 వేల మందికి ప్రవేశాలు లభించేవి. అయితే అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం వేయి మందికి కూడా పీహెచ్డీ అవకాశం దక్కేలా లేదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించకపోవడంతో బోధనకు, పరిశోధనకు కొరత ఏర్పడింది. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఈ విద్య సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులకు అనుమతినిచ్చారు. ఓయూ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న 15 అటానమస్ కాలేజీల్లో పని చేసే అర్హత గల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశాలను కల్పించారు. ఓయూలో పని చేసే పార్టుటైం, కాంట్రాక్టు అధ్యాపకులు బోధనకే పరిమితం. రెండేళ్ల క్రితం వరకు అర్హత గల కాంట్రాక్టు అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో వారికి గైడ్షిప్ను రద్దు చేశారు. (క్లిక్: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!) పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కొనసాగించాలి ఓయూలో పాత పద్దతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలి. కొత్త పద్ధతిలో అడ్మిషన్లకు పీహెచ్డీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త విధానంలో అడ్మిషన్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వీసీ ప్రొ.రవీందర్ సొంత నిర్ణయాలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తాయి. కాకతీయ వర్సిటీ తరహాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసే అర్హత గల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలి. కొత్త విధానంతో పీహెచ్డీ ప్రవేశాలను చేపడితే అడ్డుకుంటాం. – కొర్ర శరత్‌నాయక్ పరిశోధనలు కుంటుపడతాయి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చదివితే హాస్టల్ వసతి, ఫెలోషిప్‌లకు అవకాశం ఉండదు. సంపాదించే వయస్సులో పీహెచ్డీ చేయడమే ఎక్కువ.. పరిశోధనలకు రూ.లక్షలు ఖర్చు చేయాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల విద్యార్థులకు సొంతంగా ఖర్చుపెట్టుకుని పీహెచ్డీ చదివే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అనుమతితో అధిక శాతం మంది పరిశోధనలు చేయలేరు. దీంతో పరిశోధనలు కుంటుపడతాయి. ఓయూలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అర్హత గల వారికి గైడ్షిప్కు అవకాశం కల్పించాలి లేదా ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయాలి. – బైరు నాగరాజుగౌడ్ ఓయూ విద్యార్థులపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న ఓయూ జేఏసీ నాయకులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. బుధవారం ఓయూ పాలన భవనం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై టాస్క్‌ఫోర్స్ పోటీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థులపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ సృహ తప్పి పడిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో పాల్గొన్న 27 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కొత్త విధానంతో విద్యార్థులు నష్టపోతారని పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (క్లిక్: హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ) -
పీహెచ్‌డీతో ఉజ్వల భవిత
- జేఎన్టీయూ పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం.. ఫిబ్రవరి 11 చివరి గడువు - రిజర్వేషన్ల వారీగా సీట్ల భర్తీ జేఎన్టీయూ : కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని తపించే వారికి పరిశోధన రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. సాంకేతిక రంగంలో అయితే మరీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతటి గొప్ప లక్ష్యాలు లేకున్నా పీహెచ్డీ పూర్తయితే ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫ్యాకల్టీగా పని చేసేవారికి రెట్టింపు జీతం ఇస్తున్నారు. దీంతో చాలామంది అభ్యర్థులు జేఎన్టీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. నోటిఫికేషన్ పడినప్పుడల్లా 4వేల నుంచి 5వేల మంది వరకూ ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. వర్శిటీ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తూనే వస్తోంది. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లోని రీసెర్చ్ సెంటర్లలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎక్స్టర్నల్, పార్ట్‌టైం పీహెచ్‌డీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్స్టర్నల్ పీహెచ్డీ, 23 అనుబంధ రీసెర్చ్ సెంటర్లలో ఫుల్‌టైం పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 11వ తేదీ చివరి గడువుగా నిర్ధేశించారు. దరఖాస్తు రుసుము రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన తర్వాత వచ్చే రసీదును ‘ద డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్టీ యూనివర్సిటీ, అనంతపురం’ పేరు మీద రిజిస్టర్ పోస్ట్‌లోనో, కొరియర్లోనో పంపవచ్చు. ఎక్స్టర్నల్, ఫుల్ టైం పీహెచ్‌డీలకు వేర్వేరు దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు కాల వ్యవధి - పుల్టైం పీహెచ్డీ కోర్సు కాల వ్యవధి కనీసం మూడు సంవత్సరాలు. ఆరు సంవత్సరాల్లోపు కోర్సు పూర్తి చేయాలి. - ఎక్స్టర్నల్ పీహెచ్డీ కోర్సు కాల వ్యవధి కనీసం నాలుగు సంవత్సరాలు. ఎనిమిది సంవత్సరాల్లో పూర్తి చేయాలి. - ఎక్స్టర్నల్ ఎంఫిల్, ఎంఎస్ కోర్సుల కాల వ్యవధి కనీసం రెండేళ్లు. నాలుగేళ్లలో పూర్తి చేయాలి. ఫీజు వివరాలు : అడ్మిషన్ పొందిన వారు ప్రతి సెమిస్టర్‌కు రూ.20 వేలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఇవి కాక ప్రి-సబ్మిషన్ సెమినార్‌కు రూ.7,500, మూడు దఫాలు ప్లాగరిజమ్ చెక్కు రూ.3వేలు, థీసిస్ సబ్మిషన్కు రూ.10 వేలు ఫీజులుగా నిర్ధేశించారు. అభ్యర్థుల ఎంపిక ఇలా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 60 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించారు. సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్ (యూజీసీ), నెట్, స్లెట్, సెట్, గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉండదు. వారు నేరుగా ఇంటర్వ్యూకు రావచ్చు. దూరవిద్య ద్వారా ఎంఫిల్ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలో అవకాశం కల్పించరు. ఇంటర్వ్యూలో ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేస్తారు. పీహెచ్డీ కోర్సుకు అర్హతలు - ఎంటెక్, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్సెస్), ఎంసీఏ, ఫార్మాడి పూర్తి చేసిన వారు ఫార్మసీలో పరిశోధన చేయవచ్చు. - ఫుడ్ టెక్నాలజీ విభాగంలో పరిశోధన చేయాలనుకునేవారు ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, హోమ్ సైన్సెస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, పుడ్ సైన్సెస్, న్యూట్రీషన్, వెటర్నరీ సైన్సెస్) పూర్తిచేసిన వారు, ఎంటెక్ (బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, డైరీ టెక్నాలజీ ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. - ఎంఫిల్‌లో కేవలం మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. - ఎంఎస్ ప్రోగ్రాం సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో 5 సీట్ల చొప్పున కేటాయించారు. ఎక్స్టర్నల్ పీహెచ్డీ సీట్ల వివరాలు రిజర్వేషన్ వారీగా... విభాగం సీట్లు ఓసీ బీసీ - ఏ బీసీ - బీ బీసీ - సీ బీసీ - డీ బీసీ - ఈ ఎస్సీ ఎస్టీ సివిల్ 25 13 01 03 00 02 01 03 02 ఈఈఈ 25 13 01 03 00 02 01 04 01 మెకానికల్ 25 12 02 02 00 02 01 04 02 ఈసీఈ 25 12 02 02 01 01 01 04 02 సీఎస్ఈ 25 13 02 02 00 02 01 04 01 కెమికల్ 05 02 01 01 00 00 00 00 01 ఫార్మసీ 20 10 01 02 01 01 01 03 01 మేథమేటిక్స్ 15 08 01 01 00 01 01 02 01 ఫిజిక్స్ 10 05 01 01 00 00 01 01 01 కెమిస్ట్రీ 10 05 00 01 00 01 01 02 00 ఇంగ్లీష్ 10 05 01 01 00 01 00 02 00 మేనేజ్మెంట్ 10 05 01 01 00 01 00 01 01 బయోటెక్ 05 03 01 01 00 00 00 01 00 ఫుడ్‌టెక్ 05 02 00 01 00 01 00 01 00 మొత్తం 215 108 15 22 02 15 09 32 13 పుల్టైం పీహెచ్డీ సీట్ల వివరాలు రిజర్వేషన్ కేటగిరి వారీగా... సివిల్ 03 01 01 01 ఈఈఈ 07 03 01 01 01 01 మెకానికల్ ఇంజినీరింగ్ 16 08 01 02 00 01 01 02 01 ఈసీఈ 14 07 01 01 00 01 01 02 01 సీఎస్ఈ 07 04 00 01 00 01 00 00 01 ఫార్మసీ 36 18 03 04 01 02 01 05 02 కెమిస్ట్రీ 01 01 ఇంగ్లీష్ 01 01 మేనేజ్మెంట్ 06 03 00 01 00 01 00 01 00 మొత్తం 98 49 07 10 01 07 04 14 6 -
ఇంకెప్పుడో?
పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల నిరీక్షణ ఆర్‌జీఎన్‌ఎఫ్, ఎంఫిల్, ఇతర ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాకపోవడంతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. కేయూ క్యాంపస్ : పీహెచ్‌డీలో ప్రవేశాలకు మార్గదర్శకాల కోసం కొన్ని నెలల క్రితమే ప్రొఫెసర్లతో కూడిన ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి నివేదిక ను యూనివర్సిటీ అధికారులకు ఇచ్చింది. ఆ తర్వాత పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం వివిధ విభాగాల నుంచి ఎన్నిసీట్లు ఉన్నాయో అన్ని విభాగాల అధిపతుల నుంచి సమాచారం సేకరించారు. ఇక పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు పలు అభ్యంతరాలతో యూనివర్సిటీ అధికారులు మళ్లీ మరో కమిటీని ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించారు. అందులో ప్రధానంగా ఇప్పటికే రాజీవ్గాంధీనేషనల్ ఫెల్లోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్) కలిగిన అభ్యర్థులకు పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు కల్పించాలా వద్దా అనే విషయంలో ఆ కమిటీ వేశారు. కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ ఎం.సుబ్రహ్మణ్యశర్మ చైర్మన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా డాక్టర్ జి.బ్రహ్మేశ్వరితోపాటు మరో నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ నియమించారు. ఆ కమిటీ యూజీసీ నియమనిబంధనలు, ఇతర యూనివర్సిటీల్లో ఆర్‌జీఎన్‌ఎఫ్ అభ్యర్థులకు అడ్మిషన్ల కల్పిస్తున్న అంశాలను పరిశీలించి నివేదికను ఈ ఏడాది ఏప్రిల్ 28న యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఆర్జీఎన్ఎఫ్తోపాటు జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, డీఎస్టీ తదితర ఫెల్లోషిప్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఎంట్రె న్‌సతో సంబంధం లేకుండా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని ఆ కమిటీ నివేదించింది. ఫెల్లోషిప్ కలిగిన అభ్యర్థులకు త్రిసభ్య కమిటీతో ఇంటర్వ్యూలు నిర్వహించి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వివిధ ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థులకు పలు విభాగాల్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ప్రవేశాలు కల్పించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ విభాగంలో ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. ఆయా అభ్యర్థులు యూనివర్సిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రెగ్యులర్ వీసీ ఉన్నా.. పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశపరీక్ష ద్వారా కూడా పీహెచ్‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. నెలలు గడిచినా పీహెచ్డీ ప్రవేశాల పరీక్షకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇన్చార్జి వీసీల పాలనలో పీహెచ్‌డీల ప్రవేశాల నోటిఫికేషన్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు కేయూ రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ ఆర్.సాయన్న బాధ్యతలను స్వీకరించారు. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా పలుసార్లు వీసీకి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. తగ్గనున్న సీట్లు.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి పలు విభాగాల్లో సీట్లు తగ్గే అవకాశాలున్నారుు.మరికొన్నింట్లో పెరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే. ఆర్‌జీఎన్‌ఎఫ్ తదితర ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థుల ప్రవేశాలు పూర్తయ్యాక మళ్లీ వేకెన్సీలు సేకరిస్తారని సమాచారం. దీంతో పీహెచ్డీ నోటిఫికేషన్ ఇంకా జాప్యం కానుందని భావిస్తున్నారు. పీహెచ్డీ సీట్ల వేకెన్సీలు ఇవే.. కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ సీట్ల ఖాళీల వివరాలు ఇలా ఉన్నారుు. బాటనీ 18, బయోకెమిస్ట్రీ 7, కెమిస్ట్రీ 13, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 38, కంప్యూటర్ సైన్స 4, ఎకనామిక్స్ 13, ఇంగ్లిష్ 18, ఎడ్యుకేషన్ 8, జియాలజీ 1, హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 4, మ్యాథమెటిక్స్ 8, మైక్రోబయాలజీ 9 ,ఫిజిక్స్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 6, పొలిటికల్ సైన్స 12, ఫార్మసీ 16, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం 3, సోషియాలజీ 15, తెలుగు 11, జువాలజీ 18, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం 11, మెకానికల్ ఇంజనీరింగ్ 23, కంప్యూటర్ సైన్సలో 9, ఎలక్టిక్రల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్స 5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్సలో 4 సీట్లు ఉన్నారుు. వివిధ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశాల పూర్తయ్యాక ఆయా విభాగాల్లో మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఆయా విభాగాల్లో సీట్లు తగ్గిపోనున్నాయి. కొన్నింట్లో అసలే ఖాళీలు ఉంటాయో లేదో అనేది కూడా అనుమానమే. ప్రవేశ పరీక్షలతోనే జాప్యం.. పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఒకప్పుడు రెండు ఆర్టికల్స్ ఉంటే పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇచ్చేవారు. ప్రతి ఆరునెలలకోసారి పీహెచ్‌డీలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేవారు. ప్రవేశ పరీక్షలు వచ్చాక అనేక కారణాలతో సంవత్సరాల తరబడి జాప్యం అవుతోంది. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాల బాధ్యులు ఆందోళనలు చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలంగా వివిధ విభాగాల్లో సీనియర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందడం వలన కూడా పీహెచ్‌డి వివిధ విభాగాల్లో సీట్లు తగ్గిపోతున్నాయి.జాప్యం కావడంతో ఇంకా పలు సమస్యలు తలెత్తుతున్నాయి.