ఎంసెట్‌ కేసులో సీన్‌ రివర్స్‌.. | Sean reverse in EAMCAT case. | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ కేసులో సీన్‌ రివర్స్‌..

Published Wed, Jul 12 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

ఎంసెట్‌ కేసులో సీన్‌ రివర్స్‌..

ఎంసెట్‌ కేసులో సీన్‌ రివర్స్‌..

నిందితుల జాబితాలోకి జేఎన్‌టీయూ అధికారులు?
► బ్రోకర్లుగా మారిన తల్లిదండ్రులూ నిందితులే
►  కేసు దర్యాప్తును తిరగదోడుతున్న వైనం  


సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల్లో సంచల నం రేపిన ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. కేసు పూర్తయి చార్జిషీట్‌ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న దర్యాప్తు అధికారులకు ఉన్నతాధికారులు ఝలక్‌ ఇచ్చారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యాన్ని పేర్కొన కపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం ఎంసెట్‌ కేసులో డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ను రూ పొందించిన దర్యాప్తు అధికారులు.. దానిని కోర్టుకు పంపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కేసు పూర్వాపరాలు, దర్యాప్తు వివరాలను సీఐడీ ఉన్నతాధికారులు పరిశీలిం చారు. కేసులో అసలు విషయం తెలుపకుండా చార్జిషీట్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

వారి పాత్రను చేర్చాల్సిందే..
ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో జేఎన్‌టీయూ అధికారులు ఎంసెట్‌ ప్రశ్నపత్రం ప్రింట్‌ చేయించారు. ఈ ప్రెస్‌ నుంచి ఇప్పటివరకు 11 సార్లు వివిధ రాష్ట్రాల ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలు లీక్‌ అయిన చరిత్ర ఉంది. ఆ ప్రెస్‌లోనే జేఎన్‌టీయూ, ఎంసెట్‌ నిర్వహణ అధికారులు ఎందుకు ప్రింటింగ్‌ చేయించారు? గతంలో ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం తెలియక ప్రింటింగ్‌ చేశారా? తెలిసే చేయించారా? అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

గతంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పీజీ మెడికల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో వర్సిటీ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలిందని, ఇప్పు డు కూడా వర్సిటీ అధికారులు కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర నిందితులతో లింక్‌ ఉం టుందని, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో వేలాది విద్యార్థుల భవిష్యత్‌ అంధ కారంలో పడిందని, దీనికి కారణం సంబంధి త అధికారుల నిర్లక్ష్యమే నని, ఈ మేరకు వారి నిర్లక్ష్యంపై చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొనా ల్సిందేనని ఆ ఉన్నతాధి కారి దర్యాప్తు అధికారులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

దర్యాప్తు తిరగదోడాల్సిందే..
ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ ఎంసెట్‌ కేసు దర్యాప్తును తిరగదోడే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశ్నపత్రాలు ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే ముద్రిస్తున్న విషయం నిందితులకు ఎలా తెలిసింది? ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ లీక్‌ చేసిన రావత్‌ అనుమానాస్పద మృతి వెనకున్న అసలు కథేంటి? అన్న అంశాలపై సీనియర్‌ ఐపీఎస్‌ ఇప్పుడు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లీకేజీకి కీలక సూత్రధారిగా ఉన్న కమిలేశ్‌కుమార్‌సింగ్‌ సీఐడీ కస్టడీలో మృతిచెందాడు. కీలక నిందితు లిద్దరి మరణం యాదృచ్ఛికమా? లేకా ఇంకేదైనా ఉండి ఉంటుందా? అన్న కోణంలో కేసు దర్యాప్తును సంబంధిత అధికారి తిరగదోడున్నట్టు తెలుస్తోంది.

తల్లిదండ్రులూ నిందితులే...
తన కూతురో/కుమారుడి కోసమో ప్రశ్నపత్రం కొనుగోలు చేసి ఉంటే మానవతా దృక్పథంతో వదిలివేశారు అను కోవచ్చు. అలాకాకుండా మరో ఐదారుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్‌ చేసి, డబ్బులు దండుకున్న పలువురు తల్లిదండ్రులను నిం దితులుగా చేర్చాల్సిందేనని సంబంధిత సీనియర్‌ ఐపీఎస్‌ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో బ్రోక ర్లుగా మారిన 12 మంది తల్లిదండ్రులను నిందితుల జాబితాలో చేరుస్తున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

దర్యాప్తు పూర్తయిం దనుకున్న సమయంలో సీన్‌ రివర్స్‌ అవడం దర్యాప్తు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి స్తోంది. కేసు దర్యాప్తు లో చూసీచూడనట్టుగా వ్యవహరించిన పలు కీలకాంశాలు ఇప్పుడు ఏ అధికారి మెడకు చుట్టుకుంటాయోనని వారు ఆందోళన చెం దుతున్నారు. లాలూచీ పడ్డట్టు తేలితే దర్యా ప్తు అధికారులు సైతం ఊచలు లెక్కబెట్టక తప్పదని సీఐడీలోని సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం..
ఎంసెట్‌ కేసులో నిర్వాహకులు, సంబంధిత అధికారుల పాత్రపైనా విచారణ చేస్తున్నాం. పేపర్‌ లీక్‌లో వారి పాత్ర ఉన్నట్టు పెద్దగా ఆధారాలు దొరకలేదు. అయితే పదే పదే లీక్‌ అవుతున్న ప్రింటింగ్‌ ప్రెస్‌కే ముద్రణ బాధ్యతలు అప్పగించడంపై అనుమానా లున్నాయి. దీనిపై విచారణ చేసేందుకు 18, 19 తేదీల్లో దర్యాప్తు అధికారులు, నేను స్వయంగా ఢిల్లీ ప్రింటింగ్‌ ప్రెస్‌కు విచారణ నిమిత్తం వెళ్తున్నాం. ఆధారాలు పక్కాగా దొరికితే 100 శాతం నిందితుల జాబితాలో చేరుస్తాం. – సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement