Investigate the case
-
సమత కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో హత్యాచారానికి గురైన సమత కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్లో సాక్షులను విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తీర్పును ఈ నెల 27వ తేదిన వెల్లడించనున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ 24వ తేదీన నిందితులైన ఎ1 షెక్ బాబా, ఎ2 షేక్ షాబోద్దీన్, ఎ3 షెక్ ముఖ్దీమ్లు కొమరంభీం జిల్లా ఎల్లపటార్ గ్రామంలో సమతను అత్యాచారం చేసి, హత్యా చేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 27వ తేదిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 11న ప్రభుత్వం కేసు విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఇక డిసెంబర్ 14న పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా కేసులోని 44 మంది సాక్షులలో 25 మందిని కోర్టు విచారించింది. చదవండి: సమత కేసు డిసెంబర్ 26కి వాయిదా -
సమత కేసు డిసెంబర్ 26కి వాయిదా
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ రెండోరోజు ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమత కేసులో రెండో రోజు సాక్షులను పోలీసులు మంగళవారం కోర్టుహాల్లో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టులో సమత కేసు సాక్షుల విచారణ కొనసాగింది. కాగా సోమవారం ఏడుగురు సాక్షులను విచారించాల్సి ఉండగా.. కేవలం మృతురాలి భర్త, దగ్గరి బంధువును మాత్రమే ప్రత్యేక కోర్టు విచారించింది. తొలిరోజు మిగిలిన ఐదుగురితోపాటు.. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాక్ష్యం చెప్పాల్సిన ఏడుగురు, మొత్తంగా 12 మందిని కోర్టు విచారించనున్నది. డిసెంబర్ 31 వరకు సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనున్నది. తర్వాత పోలీసులు నమోదు చేసిన డీఎన్ఏ, ఎఫ్ఐఆర్ , ఇతర ఆధారాలు, సాక్షాధారాలు పరిశీలించి జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక కోర్టుకు వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి వెళ్లారు. ఈ రోజు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌ను పరిశీలించడానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టులో సమత కేసు విచారణ కూడా జరుగుతుండటంతో ఐజీ నాగిరెడ్డి ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. రెండో రోజు విచారణ అనంతరం సమత కేసును ప్రత్యేక కోర్టు గురువారానికి (డిసెంబర్ 26) వాయిదా వేసింది. -
పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..
సాక్షి, తొట్టంబేడు : అదృశ్యమైన బాలిక శవమైంది..చెత్తకుప్పల నడుమ కాలిపోయిన స్థితిలో మృతదేహం వెలుగులోకి వచ్చింది..సహజంగానే మృతిపై ఎన్నో అనుమానాలు..అయితే హత్య కాదు..అలాగనీ ఆత్మహత్యా కాదని ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ బాలసుబ్రమణ్యం చెప్పడం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులకు అంతులేని వేదనను మిగిల్చింది. మండలంలోని చిలకా మహాలక్ష్మి ఆలయం వెనుక ఉన్న డంపింగ్ యార్డులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలిక పింకీ (16) మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో శుక్రవారం గుర్తించడం స్థానికంగా సంచలనం సృష్టించడం విదితమే. పోస్టుమార్టం నిమిత్తం పింకీ మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విలేకరులతో మాట్లాడుతున్న పింకీ తల్లిదండ్రులు శ్రీచంద్ర, బూరీ పోస్టుమార్టం నివేదిక అందకనే పోలీసులు మాత్రం పింకీది హత్య కాదు.. ఆత్మహత్య కాదని తేల్చడం గమనార్హం! బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం, ఊరుకాని ఊరువచ్చిన కుటుంబానికి కుమార్తె అనుమానాస్పద మృతి అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. మృతురాలి తల్లిదండ్రులు, స్థానికులు మాత్రం పింకీది హత్యేనని తెగేసి చెబుతుండగా, పోలీసులు దీనికి భిన్నంగా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పుడే వస్తానంటూ తన అన్న రింకూకు చెప్పి గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెళ్లిన పింకీ శవమై వెలుగులోకి రావడం తెలిసిందే. వాస్తవానికి పోలీస్ జాగిలం డంపింగ్ యార్డులోని పింకీ మృతదేహం నుంచి కొంతదూరంలోని ఓ గోదాము వద్దకు వెళ్లి ఆగిపోయింది. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాపు చేయకుండా ఏకంగా పింకీది హత్య, ఆత్మహత్య కాదని చెప్పడం దారుణమని పింకీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ రెండూ కానప్పుడు హత్య, ఆత్మహత్య కాకుంటే మరేమిటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు చేయాలని వేడుకుంటున్నారు. ఏడాదిగా పింకీ వెంట ఓ యువకుడు తిరుగుతున్నాడని స్థానికులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
ఎంసెట్ కేసులో సీన్ రివర్స్..
నిందితుల జాబితాలోకి జేఎన్టీయూ అధికారులు? ► బ్రోకర్లుగా మారిన తల్లిదండ్రులూ నిందితులే ► కేసు దర్యాప్తును తిరగదోడుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచల నం రేపిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. కేసు పూర్తయి చార్జిషీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న దర్యాప్తు అధికారులకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో జేఎన్టీయూ అధికారుల నిర్లక్ష్యాన్ని పేర్కొన కపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఎంసెట్ కేసులో డ్రాఫ్ట్ చార్జిషీట్‌ను రూ పొందించిన దర్యాప్తు అధికారులు.. దానిని కోర్టుకు పంపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కేసు పూర్వాపరాలు, దర్యాప్తు వివరాలను సీఐడీ ఉన్నతాధికారులు పరిశీలిం చారు. కేసులో అసలు విషయం తెలుపకుండా చార్జిషీట్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వారి పాత్రను చేర్చాల్సిందే.. ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో జేఎన్టీయూ అధికారులు ఎంసెట్ ప్రశ్నపత్రం ప్రింట్ చేయించారు. ఈ ప్రెస్ నుంచి ఇప్పటివరకు 11 సార్లు వివిధ రాష్ట్రాల ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయిన చరిత్ర ఉంది. ఆ ప్రెస్లోనే జేఎన్టీయూ, ఎంసెట్ నిర్వహణ అధికారులు ఎందుకు ప్రింటింగ్ చేయించారు? గతంలో ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం తెలియక ప్రింటింగ్ చేశారా? తెలిసే చేయించారా? అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో వర్సిటీ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలిందని, ఇప్పు డు కూడా వర్సిటీ అధికారులు కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర నిందితులతో లింక్ ఉం టుందని, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో వేలాది విద్యార్థుల భవిష్యత్ అంధ కారంలో పడిందని, దీనికి కారణం సంబంధి త అధికారుల నిర్లక్ష్యమే నని, ఈ మేరకు వారి నిర్లక్ష్యంపై చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొనా ల్సిందేనని ఆ ఉన్నతాధి కారి దర్యాప్తు అధికారులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. దర్యాప్తు తిరగదోడాల్సిందే.. ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ ఎంసెట్ కేసు దర్యాప్తును తిరగదోడే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశ్నపత్రాలు ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రిస్తున్న విషయం నిందితులకు ఎలా తెలిసింది? ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ చేసిన రావత్ అనుమానాస్పద మృతి వెనకున్న అసలు కథేంటి? అన్న అంశాలపై సీనియర్ ఐపీఎస్ ఇప్పుడు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లీకేజీకి కీలక సూత్రధారిగా ఉన్న కమిలేశ్కుమార్సింగ్ సీఐడీ కస్టడీలో మృతిచెందాడు. కీలక నిందితు లిద్దరి మరణం యాదృచ్ఛికమా? లేకా ఇంకేదైనా ఉండి ఉంటుందా? అన్న కోణంలో కేసు దర్యాప్తును సంబంధిత అధికారి తిరగదోడున్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులూ నిందితులే... తన కూతురో/కుమారుడి కోసమో ప్రశ్నపత్రం కొనుగోలు చేసి ఉంటే మానవతా దృక్పథంతో వదిలివేశారు అను కోవచ్చు. అలాకాకుండా మరో ఐదారుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసి, డబ్బులు దండుకున్న పలువురు తల్లిదండ్రులను నిం దితులుగా చేర్చాల్సిందేనని సంబంధిత సీనియర్ ఐపీఎస్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో బ్రోక ర్లుగా మారిన 12 మంది తల్లిదండ్రులను నిందితుల జాబితాలో చేరుస్తున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిం దనుకున్న సమయంలో సీన్ రివర్స్ అవడం దర్యాప్తు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి స్తోంది. కేసు దర్యాప్తు లో చూసీచూడనట్టుగా వ్యవహరించిన పలు కీలకాంశాలు ఇప్పుడు ఏ అధికారి మెడకు చుట్టుకుంటాయోనని వారు ఆందోళన చెం దుతున్నారు. లాలూచీ పడ్డట్టు తేలితే దర్యా ప్తు అధికారులు సైతం ఊచలు లెక్కబెట్టక తప్పదని సీఐడీలోని సీనియర్ ఐపీఎస్ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం.. ఎంసెట్ కేసులో నిర్వాహకులు, సంబంధిత అధికారుల పాత్రపైనా విచారణ చేస్తున్నాం. పేపర్ లీక్‌లో వారి పాత్ర ఉన్నట్టు పెద్దగా ఆధారాలు దొరకలేదు. అయితే పదే పదే లీక్ అవుతున్న ప్రింటింగ్ ప్రెస్‌కే ముద్రణ బాధ్యతలు అప్పగించడంపై అనుమానా లున్నాయి. దీనిపై విచారణ చేసేందుకు 18, 19 తేదీల్లో దర్యాప్తు అధికారులు, నేను స్వయంగా ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్‌కు విచారణ నిమిత్తం వెళ్తున్నాం. ఆధారాలు పక్కాగా దొరికితే 100 శాతం నిందితుల జాబితాలో చేరుస్తాం. – సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్ -
బాలికపై అత్యాచారయత్నం
వరుసకు బాబాయే నిందితుడు పరిగి: బాబాయి వరుసయ్యే ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా పరిగి మండల పరిధిలోని మల్లెమోనిగూడలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గత గురువారం మధ్యాహ్నం సంక్రాంతి రోజున కుటుంబీకులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఆమెకు వరుసకు బాబాయి అయ్యే అల్లాడి వెంకటేష్(25) ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. భయపడిన బాలిక కేకలు వేయడంతో కుటుంబీకులు వచ్చారు. అంతలోనే వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. పండగ ఉండటంతో గ్రామస్తులు, బంధువుల ఒత్తిడి మేరకు బాధితురాలి కుటుంబీకులు అదేరోజు ఫిర్యాదు చేయలేకపోయారు. ఎట్టకేలకు ధైర్యం చేసి సోమవారం పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్వరలోనే నిందితుడిని పట్టుకొని రిమాండుకు తరలిస్తామని ఎస్ఐ కృష్ణ తెలిపారు.