సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో హత్యాచారానికి గురైన సమత కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్‌లో సాక్షులను విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తీర్పును ఈ నెల 27వ తేదిన వెల్లడించనున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ 24వ తేదీన నిందితులైన ఎ1 షెక్ బాబా, ఎ2 షేక్ షాబోద్దీన్, ఎ3 షెక్ ముఖ్దీమ్‌లు కొమరంభీం జిల్లా ఎల్లపటార్ గ్రామంలో సమతను అత్యాచారం చేసి, హత్యా చేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 27వ తేదిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 11న ప్రభుత్వం కేసు విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఇక డిసెంబర్ 14న పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా కేసులోని 44 మంది సాక్షులలో 25 మందిని కోర్టు విచారించింది.
చదవండి: సమత కేసు డిసెంబర్ 26కి వాయిదా
Comments
Please login to add a commentAdd a comment