- 4,775 మంది విద్యార్థులు హాజరు
జేఎన్‌టీయూ:
ఎంసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా 8 నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారం పూర్తి అయింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురంలో 2365 మంది, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో 2410 మంది మొత్తం 4,775 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు.
అయితే రాష్ట్రంలోని ఏ హెల్ప్‌లైన్ సెంటర్‌లో నైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. దీంతో కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో 6,700 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. తాజా కౌన్సెలింగ్‌లో ఆశించినంత స్థాయిలో సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యార్థులు హాజరుకాలేదు. అనంతపురం జిల్లాలో మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు డిమాండ్ అధికంగా ఉంది. వీటిలో ఇప్పటికే యాజమాన్య కోటాలో ఉన్న ఇంజినీరింగ్ సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. 20వ తేదీ వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి చివరి తేదీగా నిర్ణయించారు. 21, 22 తేదీలలో వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. 25న సీట్లు భర్తీ కానున్నాయి.