విద్యార్థుల భవితపై నిర్లక్ష్యం | negligance on students future | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవితపై నిర్లక్ష్యం

Published Wed, Oct 19 2016 10:23 PM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

విద్యార్థుల భవితపై నిర్లక్ష్యం - Sakshi

విద్యార్థుల భవితపై నిర్లక్ష్యం

 – సెమిస్టర్‌ మార్కుల్లో తేడా వస్తే రీవాల్యుయేషన్‌ లేదు
– ఏటా సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
– ఛాలెంజింగ్‌ రీవాల్యుయేషన్‌ పేరుతో విద్యార్థులకు భారం
– ప్రతి సబ్జెక్టుకూ రూ.10 వేలు చెల్లించాల్సిందే
– జేఎన్‌టీయూ విద్యార్థులకు తీరని వెతలు


జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని విద్యార్థుల శ్రేయస్సును యూనివర్శిటీ పాలకులు విస్మరించారు. యూనివర్శిటీ పరిధిలో పరీక్షలు పకడ్బంధీగా జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ఫలితాలు నిర్దేశించిన గడుపులోపే ప్రకటిస్తున్నారు. అయితే ప్రకటించిన ఫలితాల్లో విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉండి రీవాల్యుయేషన్‌ (పునర్‌ మూల్యాంకనం)కు దరఖాస్తు చేసుకోసే విధానం లేకపోవడం చేత విద్యార్థులు నష్టపోతున్నారు. ఇదే స్థానంలో ఛాలెంజింగ్‌ రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థి ఫెయిల్‌ అయితే.. తిరిగి పరీక్షలు రాసుకోవడం మినహా ఎలాంటి వెసులుబాటూ లేదు. ఫలితంగా విద్యార్థి నష్టపోవాల్సి వస్తోంది.

    జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో అనుబంధ  కళాశాలలు ఉన్నాయి. 118 ఇంజినీరింగ్‌ , 36 ఫార్మసీ, 35 ఏంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 5 ఇంటిగ్రేటేడ్‌ క్యాంపస్‌లు ఉన్నాయి. బీటెక్‌ 1,20,000 మంది విద్యార్థులు, బీఫార్మసీ 12 వేలు, ఎంబీఏ 18 వేలు, ఎంసీఏ 3 వేలు, ఫార్మా డి 8 వేలు, ఎంటెక్‌ 8 వేల మంది విద్యార్థులు ప్రతి సారీ సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఫలితాలు నిర్దేశించిన గడువులోపు ప్రకటిస్తున్నారు. కానీ ఫలితాల ప్రకటనలోవిద్యార్థులకు ఏమైనా సందేహాలు తలెత్తి, రీవ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. చాలెంజింగ్‌ రీవ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది.

రూ.10వేలు ఫీజు చెల్లించాల్సి వస్తోంది :
    ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేలు ఛాలెంజింగ్‌ రీవాల్యుయేషన్‌ కోసం విద్యార్థులు చెల్లించాల్సి ఉంది. ఉత్తీర్ణత అయితే రూ.8 వేలు వెనక్కి చెల్లిస్తారు. లేదంటే చెల్లించిన రూ.10 వేలు ఫీజు వర్సిటీ ఖాతాలో జమ అవుతోంది. ఇలాంటి సంక్లిష్ట  విధానాలతో విద్యార్థులకు కుదేలవుతున్నారు.

విద్యార్థులకు ఛాలెంజింగ్‌ :
             సరళమైన రీతిలో పరీక్ష ఫీజులు నిర్దేశించాలి. అప్పుడే గరిష్టంగా విద్యార్థులకు దోహదపడుతుంది. ఎక్కువ మంది దరఖాస్తు చేయకూడదని ఛాలెంజింగ్‌ రీవాల్యుయేషన్‌ పేరుతో ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  అంటే పరీక్ష ఫీజు చెల్లించే స్థోమత ఉన్నవారికే ఈ వెసులుబాటు కలుగుతోంది. పేద, మధ్యతరగతి, గ్రామీణ  విద్యార్థులకు ఛాలెంజింగ్‌ వాల్యుయేషన్‌ మింగుడుపడని అంశంగా తయారైంది. ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధానాలు అనుసరించకుండా నిరోధించే ప్రక్రియలు అవలంబిస్తుండడంతో విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రీవాల్యుయేషన్‌ విధానం పాటించి విద్యార్థుల శ్రేయస్సుకు వర్సిటీ దోహదపడాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రీవ్యాల్యూయేషన్‌ విధానం లేదు :
       రీవాల్యుయేషన్‌ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ వర్సిటీలో లేదు. ఇప్పటికే సమయం సరిపోవడం లేదు. ఛాలెంజింగ్‌ రీవాల్యుయేషన్‌లో నూతన విధానాలు పాటించే యోచనలో ఉన్నాం. కచ్చితంగా ఉత్తీర్ణత చెందుతాడా? లేదా ? అనే అంశాలు ముందే అంచనా వేసి, ఫీజు కట్టేలా నూతన నిర్ణయాలు పాటించనున్నాం.
– ఆచార్య డి.రామానాయుడు, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్, జేఎన్‌టీయూ అనంతపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement