జేఎన్‌టీయూ ఇమేజ్ పెరగాలి
ఒకప్పుడు ఆయన అక్కడ విద్యార్థి. తర్వాత అక్కడే లెక్చరర్‌గా పాఠాలు చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ అయ్యారు. అనంతరం ఏకంగా వీసీ (జేఎన్‌టీయూ) అయ్యారు. ఆపై ఏపీపీఎస్‌సీ చైర్మన్‌గా, యూపీఎస్‌ఈ మెంబర్‌గా ఉన్నత స్థానానికి చేరుకుని ఆదర్శంగా నిలిచారు ఎ. వెంకట్రామిరెడ్డి.
అదే యూనివర్శిటీలో చదవే విద్యార్థుల సౌకర్యాలు.. బోధన తీరు.. పోటీ పరీక్షల ప్రిపరేషన్, రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు, స్వచ్ఛ భారత్ తదితర విషయూలపై విద్యార్థులతో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఆరా తీస్తూనే పలు విషయూలపై అవగాహన కలిగించారు.
వెంకట్రామిరెడ్డి: హాయ్.. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్..
స్టూడెంట్స్: వెరీ గుడ్ ఈవినింగ్ సార్..
వెంకట్రామిరెడ్డి: యూపీఎస్సీ పని ఏమిటి? ఎవరెవరిని రిక్రూట్ చేస్తుంది?
ఎంబిఏ విద్యార్థులు : సరిగా సమాధానం ఇవ్వలేదు.
వెంకట్రామిరెడ్డి: బీటెక్ విద్యార్థులు చెప్పకపోవడంలో అర్థముంది. కానీ ఎంబీఏ విద్యార్థులు చెప్పకపోతే ఎలా ?
ఎంబిఏ విద్యార్థులు: ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసే కమిషన్.
వెంకట్రామిరెడ్డి: అఖిల భారత స్థాయిలో గెజిటెడ్ హోదా గల అన్ని ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ, పదోన్నతులు కల్పించే అత్యుత్తమ కమిషనే యూపీఎస్సీ. డూ యూ నో డీ.పీ.ఎస్?
ఎంబిఏ విద్యార్థులు : డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ
వెంకట్రామిరెడ్డి: ఇక్కడ ఎంబీఏ ప్రారంభించి ఎన్నేళ్లు అవుతోంది?
శృతి : 5 ఏళ్లు అవుతోంది సార్
వెంకట్రామిరెడ్డి:ప్యాకల్టీ సరిగా చెప్పలేదనుకుంటా?
విద్యార్థులు : మౌనంగా ఉన్నారు.
వెంకట్రామిరెడ్డి: ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లో చదివిన వారికే ఎందుకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి?
శృతి: ఐఐఎం కరికులంకు, ఇక్కడి కరికులంకు వ్యత్యాసం ఎక్కువ. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కే వారు ప్రాధాన్యత ఇస్తారు. నిపుణులైన భోదన సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఎంటెక్ విద్యార్థులను ఉద్దేశించి..వెంకట్రామి రెడ్డి: కమ్యూనికేషన్స్ ఇంజనీర్లుగా ఎలాంటి నూతన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు?
సమైక్య: సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా నూతన ప్రాజెక్ట్‌లు చేస్తున్నాము. ప్రస్తుత పరిణామాలల్లో కమ్యూనికేషన్ రంగం చాలా ప్రాముఖమైంది.
వెంకట్రామిరెడ్డి: అయితే ఐటీ రంగం వైపు అందరూ వెళుతున్నారు కదూ..
శ్రవల్లి: ఐటీలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం, మెరుగైన వేతన సౌకర్యాలు వల్ల అటు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.
వెంకట్రామిరెడ్డి: సివిల్స్‌లో ఎక్కువ మంది ఐఐటీ వాళ్లే ఎందుకు విజయం సాధిస్తున్నారు?
లక్ష్మీవాణి: టెక్నికల్ బ్యాక్ గ్రౌండు ఉన్న వాళ్లు అరుుతే సివిల్ సర్వెంట్లుగా పనితీరు బాగుంటుందని యూపీఎస్సీ భావిస్తున్నట్లుంది.
వెంకట్రామిరెడ్డి: అది కరెక్ట్ కాదు. యూపీఎస్సీ దృష్టిలో అందరూ సమానమే. సాధారణ డిగ్రీ చదివిన వారు కూడా సివిల్స్‌లో సక్సెస్ అవుతున్నారు. ఎందుకుని సివిల్స్‌పై దృష్టి పెట్టడం లేదు?
కారుణ్య: టెలీ కమ్యూనికేషన్స్‌లో ప్రస్తుతం ఎం.టెక్ చదువుతున్నా. సివిల్స్‌లో భాగమైన ఐఈఎస్ (ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్)కు సన్నధ్దమవుతున్నా. సబ్జెక్ట్‌లో లోతుగా అవగాహన పెంపొందించుకుంటే సులువుగా విజయం సాధించవచ్చేనే ధీమాతో ఉన్నా.
వెంకట్రామిరెడ్డి: అందరూ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసిన వారేనా? ఎస్కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన వారు ఎవరైనా ఉన్నారా?
రాధిక: నేను బీటెక్ ఎస్కేయూలో చదివాను సార్
వెంకట్రామిరెడ్డి: అక్కడ అకడమిక్ స్టాండర్స్ ఎలా ఉన్నాయమ్మా?
రాధిక: బాగా లేవు సార్. అంతా అవినీతే.. టీచింగ్ సరిగా ఉండదు.
వెంకట్రామిరెడ్డి:హాస్టల్స్ ఎలా ఉన్నాయి?
గోపాలకృష్ణ: అన్ని వసతులు బాగానే ఉన్నాయి. కానీ విపరీతమైన నీటి ఎద్దడి ఉంది. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
వెంకట్రామిరెడ్డి: పండమేరు నుండి నీరు రావడం లేదా?
గోపాలకృష్ణ: రావడం లేదు సార్..
వెంకట్రామిరెడ్డి: మేము చదివేటపుడు హాస్టల్స్ ఎంతో ప్రతిష్టగా ఉండేవి. మంత్రుల స్థాయి వారికి కూడా ఇక్కడ నుంచే భోజనాలు పంపేవాళ్లు.. అది సరే.. మీ ప్రొఫెసర్లు బాగానే పాఠాలు చెపుతున్నారా?
ముత్తు: అవును సార్.. ప్రతి రోజూ తరగతులకు వస్తున్నాము. బాగా చెపుతున్నారు.
వెంకట్రామిరెడ్డి: కొన్ని ప్రవేటు కళాశాలల్లో ఎంటెక్ ఒట్టిగా మారిపోయింది. తరగతులకు వెళ్లకుండానే పాస్ చేసేస్తున్నారు? ఇక్కడ కూడా అలాగే ఉందా?
ముత్తు: లేదు సార్. రెగ్యులర్‌గా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ల్యాబ్‌ను ఉపయోగించుకుంటున్నాం. జేఎన్‌టీయూలో చదువుతున్నందుకు గర్వపడుతున్నాం.
వెంకట్రామిరెడ్డి: స్కాలర్‌షిప్‌లు ప్రతి నెలా వస్తున్నాయా?
రఘు: 99 శాతం మంది గేట్ ద్వారా అర్హత సాధించాము. ప్రతి నెలా 8 వేలు స్కాలర్‌షిప్ రావాల్సి ఉంది. కానీ వాటిని ప్రతి మూడు నెలలకు ఓ సారి ఇస్తున్నారు.
వెంకట్రామిరెడ్డి: లైబ్రరీలో మీ టీచర్స్ రాసిన బుక్స్ ఉన్నాయా ? లేకపోతే బయటి వారు రాసిన బుక్స్ ఉన్నాయా?
రఘు: అన్నీ ఉన్నాయి. ఫారిన్ ఆథర్స్ బుక్స్ కూడా చదువుతున్నాం.
వెంకట్రామిరెడ్డి: విజయవాడను రాజధానిగా చేయడంతో మీరు ఏకీభవిస్తారా?
యశశ్రీ: విభజన వల్ల ఇప్పటికే విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. ఇపుడు రాజధానిని కూడా సారవంతమైన వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేయడం తగదని నిపుణులు చెబుతున్నారు. వరదలు, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు.
వెంకట్రామిరెడ్డి: రాజధానిలోనే అన్ని విభాగాలు కేంద్రీకృతం చేసేలా ఉన్నారు ? మరో వేర్పాటు ఉద్యమం వచ్చే అవకాశం ఉందా?
నాగజ్యోతి: రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాల్లో వికేంద్రీకరణ చేస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజధాని చుట్టుపక్కలే ఎక్కువ సంస్థలు కేంద్రీకృతమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వేర్పాటు ఉద్యమాలకు బీజం పోసినట్లు అవుతుంది.
అక్కడే స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న విద్యార్థులతో వెంకట్రామి రెడ్డి :
ఈ కార్యక్రమం ద్వారా ఏమైనా లాభముందా? లేక పోతే పబ్లిసిటీ కోసమేనా?
సుబ్రమణ్యం: జేఎన్‌టీయూలో పరిసరాలను శుభ్రం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో పబ్లిసిటీ కోసమే ఈ కార్యక్రమాన్ని వాడుకోవడం బాధగా ఉంది. వీటికి అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారు.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించి సర్కారు బడిలో చదువుకుని అత్యంత కష్టం మీద ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
తను చదివిన ఇంజనీరింగ్ కళాశాల అయిన జేఎన్‌టీయూకు అత్యంత ఎక్కువ కాలం వీసీగా (జేఎన్‌టీయూ -హైదరాబాద్) పని చేసి సంస్కరణల్లో తన దైన ముద్ర వేశారు. ఏపీపీఎస్సీ చెర్మైన్‌గా సాహసోపేతమైన నిర్ణయూలు తీసుకున్నారు. ఇపుడు 9 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ క మిషన్లు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. యూపీఎస్సీ కమిషన్ సభ్యుడిగా పలు విషయూల్లో కీలక పాత్ర పోషించారు.