జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ(అనంతపురం) ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు వర్సిటీకి శనివారం ఉత్తర్వులు అందాయి. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన వర్సిటీలను గుర్తించి భారత ప్రభుత్వం యువజన, క్రీడా మంత్రిత్వశాఖ ప్రతి ఏడాది ఈ అవార్డును అందజేస్తోంది.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర యూనివర్సిటీ తరువాత జేఎన్‌టీయూకు ఈ అవార్డు దక్కడం విశేషం. రాష్ట్రపతి భవన్‌లో నవంబర్ 19న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జేఎన్‌టీయూ వీసీ ఆచార్య ఎం. సర్కార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్ ఈ అవార్డును అందుకోనున్నారు.
జేఎన్‌టీయూకు జాతీయ పురస్కారం
Published Sun, Oct 30 2016 12:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement