జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ , అనంతపురం 8వ స్నాతకోత్సవం డిసెంబర్‌లో నిర్వహించనుంది.
నవంబర్ 26 తుది గడువు
ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే వీలు
జేఎన్‌టీయూ : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ , అనంతపురం 8వ స్నాతకోత్సవం డిసెంబర్‌లో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ 2015–16 సంవత్సరంలో యూజీ (బీటెక్/ బీఫార్మసీ/ ఫార్మా డి ), పీజీ (ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్, ఎమ్మేస్సీ ) కోర్సులు పూర్తి చేసిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి నేరుగా స్నాతకోత్సవంలోనే పట్టా అందిస్తారు. ఆన్‌లైన్ విధానం / పోస్టు ద్వారా నవంబర్ 26 లోపు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్దేశించారు.
దరఖాస్తు విధానం ఇలా :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే వారు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు రూ. 2000 ‘ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద రిజిస్ట్రార్ –జేఎన్‌టీయూ అనంతపురం , పేరు మీద డీడీని కాని, చలానా గానీ తీసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు. ‘ ద కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎగ్జామినేషన్స్ బ్రాంచ్, జేఎన్‌టీయూ అనంతపురం పేరు మీద రిజిస్టర్ పోస్టులో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు పోస్టు ద్వారా పంపాల్సిన అవసరం లేదు. గోల్డ్‌మెడల్, పీహెచ్‌డీ పట్టా పొందే వారికి స్నాతకోత్సవం తేదీ, వేదికను త్వరలో తెలుపుతారు.