సమాజంలో మానవతా విలువలు పెం పొందాల్సిన అవసరం ఉందని జేఎ¯ŒSటీయూ ప్రిన్సిపల్ ప్రహ్లాదరావు అన్నారు. మానవతా విలువల పెంపు అనే అంశంపై సత్యసాయి సేవా ఆర్గనైజేష¯Œన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌్ట్స కళాశాలో విద్యార్థుల ర్యాలీని ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
యువతలో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ముందుకు రా వాలన్నారు. మానవతా విలువలు పెంపొందించుటలో దేశ వ్యాప్తంగా సత్యసాయి ఆర్గనైజేష¯ŒS అనేక కార్యక్రమాలు చేస్తోందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రామాంజప్ప తెలిపారు. ఆర్గనైజేష¯ŒS కన్వీనర్ రామచంద్రమూర్తి, విద్యావాహినీ కన్వీనర్ నాగభూషణరావు గుప్తా, జేఎ¯Œన్టీయూ ప్రొఫెసర్ శివశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.