ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు | trains run late | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

Published Tue, Jan 2 2018 9:06 AM | Last Updated on Tue, Jan 2 2018 9:06 AM

trains run late

సాక్షి, భువనేశ్వర్‌: ఉత్తర భారత దేశంలో మంచు ప్రభావంతో రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లు బయల్దేరే వేళల్ని సవరించి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఆలస్యంగా నడుపుతోంది. పూరీ నుంచి సోమవారం రాత్రి బయల్దేరాల్సిన 12801 పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం 7.15 గంటలకు బయల్దేరిందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రకటించింది.

ఈ నెల 2వ తేదీ (మంగళవారం) ఉదయం 10.55 గంటలకు బయల్దేరాల్సిన 12875 పూరీ-న్యూఢిల్లీ నీలాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10 గంటలకు ఆలస్యంగా బయల్దేరుతుంది. సంబల్‌పూర్‌ నుంచి జమ్మూ-తావి ఎక్స్‌ప్రెస్‌ వేళను రీషెడ్యూల్‌ చేసి మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఆలస్యంగా నడిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement