తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం | Telangana Inter Exams: TS Intermediate Board Takes Key Decision On 1 Minute Rule - Sakshi
Sakshi News home page

1 నిమిషం నిబంధన సడలింపు.. తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం

Published Fri, Mar 1 2024 8:22 PM | Last Updated on Fri, Mar 1 2024 8:34 PM

Telangana Inter Exams: Inter Board Relief Students On 1 Min Rule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. 

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు.

ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో.. తండ్రికి సూసైడ్‌ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement