తొలి తరం వ్యవస్థాపకుడు, రసాయనాల తయారీ కంపెనీ దీపక్ నైట్రేట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ చిమన్‌లాల్ కె మెహతా (సీకె మెహతా) సోమవారం కన్నుమూశారు. మౌలిక్ మెహతా కంపెనీకి సీఈవోగా ఉన్నారు.దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఒక శకం ముగిసింది అంటూ ఆయనకు నివాళులర్పించారు.
1972-73లో దీపక్ నైట్రేట్ తయారీని ప్రారంభించిన చిమన్‌లాల్ రెండేళ్లలోనే లాభాల బాట పట్టించారు. అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను ప్రారంభించడంలోనూ, దీపక్ ఫౌండేషన్‌ను స్థాపించడంలోమెహతాది కీలకపాత్ర. 1971లో దీపక్ నైట్రేట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా 20 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయడం విశేషం. దీపక్ నైట్రేట్ 1984లో మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ నుండి సహ్యాద్రి డైస్టఫ్స్, కెమికల్స్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. కంపెనీ 1995లో మహారాష్ట్రలోని తలోజాలో హైడ్రోజనేషన్ ప్లాంట్‌ను స్థాపించింది.
ప్రస్తుతం, కంపెనీ గుజరాత్‌లోని నందేసరి , దహేజ్, మహారాష్ట్రలోని తలోజా అండ్ రోహా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంట్స్ ఉన్నాయి. దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్‌లో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా రెట్లు పెరిగి, పదేళ్ల నాటి 24వ స్థానంతో పోలిస్తే దీపక్ నైట్రేట్ అయిదో అతిపెద్ద లిస్టెడ్ కెమికల్ ప్లేయర్‌గా ఉంది. ఏప్రిల్, 2023 నాటికి రూ. 25,208 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment