deepak nitrate
-
ఒక శకం ముగిసింది: ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నుమూత
తొలి తరం వ్యవస్థాపకుడు, రసాయనాల తయారీ కంపెనీ దీపక్ నైట్రేట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ చిమన్లాల్ కె మెహతా (సీకె మెహతా) సోమవారం కన్నుమూశారు. మౌలిక్ మెహతా కంపెనీకి సీఈవోగా ఉన్నారు.దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఒక శకం ముగిసింది అంటూ ఆయనకు నివాళులర్పించారు. 1972-73లో దీపక్ నైట్రేట్ తయారీని ప్రారంభించిన చిమన్లాల్ రెండేళ్లలోనే లాభాల బాట పట్టించారు. అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను ప్రారంభించడంలోనూ, దీపక్ ఫౌండేషన్‌ను స్థాపించడంలోమెహతాది కీలకపాత్ర. 1971లో దీపక్ నైట్రేట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా 20 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయడం విశేషం. దీపక్ నైట్రేట్ 1984లో మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ నుండి సహ్యాద్రి డైస్టఫ్స్, కెమికల్స్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. కంపెనీ 1995లో మహారాష్ట్రలోని తలోజాలో హైడ్రోజనేషన్ ప్లాంట్‌ను స్థాపించింది. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్‌లోని నందేసరి , దహేజ్, మహారాష్ట్రలోని తలోజా అండ్ రోహా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంట్స్ ఉన్నాయి. దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్‌లో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా రెట్లు పెరిగి, పదేళ్ల నాటి 24వ స్థానంతో పోలిస్తే దీపక్ నైట్రేట్ అయిదో అతిపెద్ద లిస్టెడ్ కెమికల్ ప్లేయర్‌గా ఉంది. ఏప్రిల్, 2023 నాటికి రూ. 25,208 కోట్లు. -
లుపిన్- దీపక్ నైట్రైట్- క్యూ1 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం లుపిన్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశ పరచడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ దీపక్ నైట్రైట్ కౌంటర్ సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం.. లుపిన్ లిమిటెడ్ ఫార్మా రంగ దిగ్గజం లుపిన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 107 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 60 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 9 శాతం తక్కువగా రూ. 3878 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో లుపిన్ షేరు 6 శాతం కుప్పకూలి రూ. 882 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 874 వరకూ జారింది. దీపక్ నైట్రైట్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో కెమికల్స్ రంగ కంపెనీ దీపక్ నైట్రైట్ రూ. 64 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం క్షీణతకాగా.. నిర్వహణ లాభం సైతం 45 శాతం తక్కువగా రూ. 102 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దీపక్ నైట్రైట్ షేరు 5 శాతం పతనమై రూ. 612 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 581 వరకూ తిరోగమించింది. -
వర్షంలోకి రసాయనలు వదులుతున్న పరిశ్రమ!
జీడిమెట్ల: రసాయన వ్యర్థాలను యథేచ్ఛగా వర్షపు నీటిలోకి వదులుతుండగా పీసీబీ అధికారులు పట్టుకున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అధికారుల కథనం ప్రకారం... జీడిమెట్ల ఫేజ్–1లోని దీపక్ నైట్రేట్ పరిశ్రమ యాజమాన్యం రసాయన వ్యర్థాలను వరద నీటిలోకి వదులుతోందన్న సమాచారం మేరకు పీసీబీ సీనియర్ ఈఈ కృపానంద్ ఆధ్వర్యంలో రోలింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వదిలిన రసాయన వ్యర్థాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నివేదిక వచ్చాక దీపక్ నైట్రేట్ పరిశ్రమకు షోకాజ్ నోటీసులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా –02 పీసీబీ కార్యాలయ ఈఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... పారిశ్రామికవాడలో ఏ ఒక్క పరిశ్రమైన వ్యర్థాలను బయటకు వదిలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే మరికొన్ని పరిశ్రమలను గుర్తించి నోటీసులు జారీ చేస్తామన్నారు. l దీపక్ నైట్రేట్ పరిశ్రమ ఘనకార్యం l పట్టుకున్న పీసీబీ అధికారులు