ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం లుపిన్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశ పరచడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ దీపక్ నైట్రైట్ కౌంటర్ సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..
లుపిన్ లిమిటెడ్
ఫార్మా రంగ దిగ్గజం లుపిన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 107 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 60 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 9 శాతం తక్కువగా రూ. 3878 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లుపిన్ షేరు 6 శాతం కుప్పకూలి రూ. 882 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 874 వరకూ జారింది.
దీపక్ నైట్రైట్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో కెమికల్స్ రంగ కంపెనీ దీపక్ నైట్రైట్ రూ. 64 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం క్షీణతకాగా.. నిర్వహణ లాభం సైతం 45 శాతం తక్కువగా రూ. 102 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దీపక్ నైట్రైట్ షేరు 5 శాతం పతనమై రూ. 612 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 581 వరకూ తిరోగమించింది.
Comments
Please login to add a commentAdd a comment