న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి.
గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,296 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,656 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 10,407 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 128 నుంచి రూ. 139కు మెరుగుపడింది.
Comments
Please login to add a commentAdd a comment