వర్షం నీటిలోకి వదిలిన రసాయన వ్యర్థాల గాఢతను పరిశీలిస్తున్న అధికారులు
జీడిమెట్ల: రసాయన వ్యర్థాలను యథేచ్ఛగా వర్షపు నీటిలోకి వదులుతుండగా పీసీబీ అధికారులు పట్టుకున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అధికారుల కథనం ప్రకారం... జీడిమెట్ల ఫేజ్–1లోని దీపక్ నైట్రేట్ పరిశ్రమ యాజమాన్యం రసాయన వ్యర్థాలను వరద నీటిలోకి వదులుతోందన్న సమాచారం మేరకు పీసీబీ సీనియర్ ఈఈ కృపానంద్ ఆధ్వర్యంలో రోలింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వదిలిన రసాయన వ్యర్థాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నివేదిక వచ్చాక దీపక్ నైట్రేట్ పరిశ్రమకు షోకాజ్ నోటీసులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా –02 పీసీబీ కార్యాలయ ఈఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... పారిశ్రామికవాడలో ఏ ఒక్క పరిశ్రమైన వ్యర్థాలను బయటకు వదిలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే మరికొన్ని పరిశ్రమలను గుర్తించి నోటీసులు జారీ చేస్తామన్నారు.
l దీపక్ నైట్రేట్ పరిశ్రమ ఘనకార్యం
l పట్టుకున్న పీసీబీ అధికారులు