PCB officers
-
వర్షంలోకి రసాయనలు వదులుతున్న పరిశ్రమ!
జీడిమెట్ల: రసాయన వ్యర్థాలను యథేచ్ఛగా వర్షపు నీటిలోకి వదులుతుండగా పీసీబీ అధికారులు పట్టుకున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అధికారుల కథనం ప్రకారం... జీడిమెట్ల ఫేజ్–1లోని దీపక్ నైట్రేట్ పరిశ్రమ యాజమాన్యం రసాయన వ్యర్థాలను వరద నీటిలోకి వదులుతోందన్న సమాచారం మేరకు పీసీబీ సీనియర్ ఈఈ కృపానంద్ ఆధ్వర్యంలో రోలింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వదిలిన రసాయన వ్యర్థాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నివేదిక వచ్చాక దీపక్ నైట్రేట్ పరిశ్రమకు షోకాజ్ నోటీసులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా –02 పీసీబీ కార్యాలయ ఈఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... పారిశ్రామికవాడలో ఏ ఒక్క పరిశ్రమైన వ్యర్థాలను బయటకు వదిలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే మరికొన్ని పరిశ్రమలను గుర్తించి నోటీసులు జారీ చేస్తామన్నారు. l దీపక్ నైట్రేట్ పరిశ్రమ ఘనకార్యం l పట్టుకున్న పీసీబీ అధికారులు -
ముక్కోణపు సిరీస్‌కు ఒప్పుకోవద్దు
కరాచీ: ఈ ఏడాది చివర్లో శ్రీలంకతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడదామని భారత్ చేస్తున్న ప్రతిపాదనను ఒప్పుకోవద్దని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ అభిప్రాయపడ్డారు. ప్రతి దానికి బీసీసీఐ వెంట మానుకోవాలన్నారు. వీలైనంత త్వరగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతామని భారత్ హామీ ఇస్తే ముక్కోణపు సిరీస్ ఆడేందుకు ఒప్పుకోవాలని సూచించారు. భారత్‌తో సుదీర్ఘ ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల పాక్ క్రికెట్‌కు లాభం చేకూరుతుందన్నారు. ‘భారత్ ప్రతిపాదనను పీసీబీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దు. ఈ ముక్కోణపు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్వదేశంలో లంకతో సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎందుకంటే ముక్కోణపు సిరీస్ ఒక్క భారత్‌కే అనుకూలంగా ఉంటుంది. బీసీసీఐ ఏనాడూ పీసీబీకి మద్దతివ్వలేదు. వాళ్ల ప్రయోజనం కోసమే మన సిరీస్‌ను సవరించేలా ప్రయత్నిస్తున్నారు’ అని మహమూద్ పేర్కొన్నారు.