న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక రంగంలోని అంకుర సంస్థ దిగంతారా తాజాగా రూ.82 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్-ఏ1 రౌండ్‌లో పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్, కలారీ క్యాపిటల్, గ్లోబల్ బ్రెయిన్స్, క్యాంపస్ ఫండ్‌తోపాటు ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ వ్యవస్థాపకులు ఈ మొత్తాన్ని సమకూర్చారు. స్పేస్-మిషన్ అష్యూరెన్స్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలను ఈ నిఘా ఉపగ్రహాలు గుర్తిస్తాయని వివరించింది. త్వరలో కంపెనీ వీటిని ప్రవేశపెట్టనుంది. (హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు)
కాన్ ఫిన్ హోమ్స్ నిధుల సమీకరణ
గృహ రుణ సంస్థ కాన్ ఫిన్ హోమ్స్ రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 1,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. పీఎస్ యూ కెనరా బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీ బోర్డు నిధుల సమీకరణ ప్రణాళికలకు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. మారి్పడిరహిత డిబెంచర్లు తదితర రుణ సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 4,000 కోట్లు, క్విప్ లేదా ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ లేదా రైట్స్ ద్వారా మరో రూ. 1,000 కోట్లు అందుకోవాలని భావిస్తోంది. బీఎస్‌ఈలో 0.6 శాతం నీరసించి రూ. 745 వద్ద ముగిసింది. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్)
Comments
Please login to add a commentAdd a comment