హర్యానాలోని మనేసర్‌లో ఉన్న అమెజాన్ ఇండియా ఐదు గిడ్డంగులలో వారానికి ఐదు రోజులు, రోజుకు 10 గంటలు పని చేసి నెలకు రూ.10088 సంపాదిస్తున్నట్లు ఓ యువకుడు వెల్లడించారు. షిఫ్ట్ సమయంలో సమయం వృధా చేయకూడదని, సీనియర్లు వాష్‌రూమ్‌లను కూడా చెక్ చేస్తుంటారని పేర్కొన్నారు.
లంచ్ లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిముషాలు విరామం లేకుండా పనిచేయాలని. రోజుకు నాలుగు ట్రక్కులకంటే ఎక్కువ దించలేము. అయినా పనిని మరింత పెంచాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తుంటారు. అనుకున్న టార్గెట్ (పని) పూర్తి చేసేవరకు నీరు తాగడానికి లేదా వాష్‌రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని మా చేత ప్రతిజ్ఞ చేయించారని చెప్పారు.
పనిచేసే మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ప్రత్యేకమైన రూమ్ లేదని, ఒకవేలా వాష్‌రూమ్ లేదా లాకర్ రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. ప్రతి రోజు తొమ్మిది గంటలు నిలబడే ఉండాలి. పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని వాపోయారు.
దీనిపైన అమెజాన్ ఇండియా అధికారులు స్పందిస్తూ.. ఈ రకమైన రూల్స్ ఎప్పుడూ పెట్టలేదని, ఒకవేలా మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఆరాతీస్తామని చెప్పారు. కార్మికులు చెప్పింది నిజమైతే అలాంటి రూల్స్ పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment