భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్ ప్రిఫ్యాబ్, కేవలం 150 గంటల సమయంలో ఒక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం.
మొత్తం 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం పూర్తిగా లేటెస్ట్ ప్రిఫ్యాబ్రికేషన్ అండ్ పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్.. 120వ గంటకు క్లాడింగ్ పూర్తయింది. మొత్తం మీద ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్మాణం పూర్తయింది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పింది, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.
150 గంటల సమయంలో ఒక నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈప్యాక్ ప్రిఫ్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియా మాట్లాడుతూ.. పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. పీఈబీ అనేది నిర్మాణం భవిష్యత్తు. పీఈబీ పరిష్కారాలు ఎక్కువ ఆమోదం పొందడంతో పరిశ్రమలో మరిన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖెల్ బోత్రా మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన నిర్మాణం పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీష్ విష్ణోయి.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిరంతర అన్వేషణను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment