దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ డీల్ ప్రకటించింది. లండన్‌కు చెందిన టెలికాం సంస్థ లిబర్టీ గ్లోబల్‌తో కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు ఒకపెంనీలు మంగళవారం సంయుక్త ప్రకటన జారీ చేసాయి. ఎనిమిదేళ్లు లేదా అంతకు మించి పొడిగించే ఎంపికతో ప్రారంభ ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇన్ఫోసిస్ ఈ ఏడాది చేసుకున్న మూడో మెగా వ్యాపార ఒప్పందం కావడం విశేషం. దీంతో దేశీయ ఐటీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయనే ఆనందం ఐటీ వర్గాల్లో నెలకొంది.
టెలికాం డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడానికి , స్కేల్ చేయడానికి ఐదేళ్లపాటు 1.64 బిలియన్ డాలర్ల (రూ. 13,673 కోట్లు) ఒప్పందంపై సంతకం చేశాయి. అంతేకాదు కాంట్రాక్టును ఎనిమిదేళ్లకు పొడిగిస్తే, ఇన్ఫోసిస్ లిబర్టీ గ్లోబల్‌కు 2.5 బిలియన్ల డాలర్లు(రూ. 20,970 కోట్లు) సేవలను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కోబాల్ట్‌ను ఉపయోగించి లిబర్టీ గ్లోబల్ కోసం తాము ఏర్పాటు చేసిన క్లౌడ్-ఫస్ట్ డిజిటల్ ఫౌండేషన్‌ను పూర్తి చేయడానికి ట్రాన్స్‌ఫార్మేటివ్ ఏఐ-ఫస్ట్ సామర్థ్యాలను ప్రారంభించేలా ఈ డీల్ సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. అటు లిబర్టీ గ్లోబల్ సీఈఓ మైక్ ఫ్రైస్ కూడా ఈ ఒప్పందంపై సంతోషాన్ని ప్రకటించారు.
కాగా ఇన్ఫోసిస్ మేలో, బ్రిటిష్ చమురు గ్యాస్ కంపెనీ బీపీ తో 1.5 బిలియన్ల డాలర్ల డీల్‌కుదుర్చుకుంది. అలాగే జూన్‌లో డాంక్సే బ్యాంక్‌తో 454 మిలియన్ డాలర్లు విలువైన ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment