దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస డీల్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా 2 బిలియన్ డాలర్ల మెగా డీల్‌ను దక్కించుకుంది. ఇది వరకే కొనసాగుతున్న ఓ క్లయింట్‌తో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమెషన్ ఆధారిత అభివృద్ధి, ఆధునికీకరణ, నిర్వహణ సేవల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఇన్ఫోసిస్ తెలియజేసింది. ఐదేళ్ల పాటు కొనసాగే డీల్ విలువ 2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. రూ.16,400 కోట్లు) అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
అయితే ఈ డీల్ పాతదా.. కొత్తదా.. క్లయింట్ కంపెనీ ఏదీ అన్న విషయాలను ఇన్ఫోసిస్ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ ఇదివరకే ఉన్నదిగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇన్ఫోసిస్ రెండు మెగా ఒప్పందాలను ప్రకటించింది. వీటిలో ఒకటి బ్రిటిష్ చమురు, గ్యాస్ కంపెనీ బీపీతో 1.5 బిలియన్ల డాలర్ల ఒప్పందం మరొకటి డాన్‌స్కే బ్యాంక్‌తో 454 మిలియన్ల డాలర్ల డీల్.
ఇదీ చదవండి ➤ ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడానికి కొన్ని రోజుల ముందే ఈ మెగా గురించి ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలియజేయడం గమనార్హం. అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితి, వృద్ధి మందగమనం వంటి పరిస్థితులతో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇన్ఫోసిస్ మాత్రం ఈ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ఇన్ఫోసిస్ వృద్ధిలో సహచర కంపెనీల కంటే ముందుంది.
Comments
Please login to add a commentAdd a comment