Man Became worlds Richest For 7 Minutes: నిజానికి అపర కుభేరుడుగా మారాలంటే వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంటుంది. ఎన్నో కష్టాలు, త్యాగాలు, సవాళ్లును చవిచూసిన తర్వాత గానీ సాథ్యం కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి కేవలం బిజినెస్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత అతను కంపెనీని మూసేశాడు ఎందుకో తెలుసా!
అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన యూట్యూబర్ మాక్స్ ఫోష్ ఒకం కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే యూకేలో కంపెనీ సెటప్ చేయడం చాలా సులభం. అంతేకాదు కంపెనీ హౌస్ అని ఒకటి ఉంది. ఫోష్ కంపెనీ పెట్టే నిమిత్తం ఆ కంపెనీ హౌస్‌కి సంబంధించిన ఫారంని పూర్తి చేశాడు. అంతేకాదు కంపెనీ పేరుకు చివర కచ్చితంగా లిమిటెడ్‌తో ముగియాలి అందుకని ఫోష్ తన కంపెనీ వెంచర్‌కి 'అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్' అని పేరు పెట్టాడు. పైగా తన కంపెనీ షేర్లను 10 బిలినియన్లగా నిర్ణయించి రిజిస్టర్ చేయించాడు. ఆ షేర్లలో ఒకదానిని 50 పౌండ్లకు విక్రయించినట్లయితే, అది అతని కంపెనీకి చట్టబద్ధంగా 500 బిలియన్ పౌండ్లు విలువ ఇస్తుంది.
ఈ మేరకు యూట్యూబర్ లండన్ వీధిలో రెండు కుర్చీలు, టేబుల్‌తో తన దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మొదట్లో పెట్టుబడి దారుల కోసం కొంత ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ తర్వాత ఒక మహిళ అతని కంపెనీలో 50 పౌండ్లకు ఒక షేర్‌ని కొనుగోలు చేసింది. దీంతో అతను ఏడు నిమిషాల పాటు ఎలెన్ మాస్క్‌ని అధిగమించి మరీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అయిపోయాడు. అయితే ఆ తర్వాత అతను అధికారుల నుంచి ఒక లేఖను అందుకున్నాడు.
అందులో ఇలా ఉంది. "మాకు అందిన సమాచారం ప్రకారం మనీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ పౌండ్‌లుగా అంచనా వేయబడింది. ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల, మీరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొవలసి వస్తుంది. అందువల్ల అన్‌లిమిటెడ్ మనీ లిమిటెడ్‌ను అత్యవసరంగా రద్దు చేయాలని సిఫార్సు చేస్తున్నాం" అని ఉంది. ఆ తర్వాత ఫోష్ ఆ పనే చేశాడు. మార్కెట్ క్యాపిటల్ లోసుగులు వినయోగించి ఇలాంటి పనులకు పాల్పడితే ఇలానే దొరికిపోతారు. అయితే ఈఘటనకు సంబంధించిన వీడియోని ఫోష్ సోషల్ మీడియాలోని నెటిజన్లుతో పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment