
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలోకి మరో కొత్త కంపెనీ దూసుకొస్తోంది. లండన్‌కు చెందిన ‘నథింగ్’ కంపెనీ తన తొలి మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై నేతృత్వంలోని నథింగ్ లండన్‌లో వర్చువల్ ఈవెంట్ ద్వారా తన జర్నీని స్టార్ చేయనుంది. ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది.
'రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్' అనే వర్చువల్ ఈవెంట్‌తో నథింగ్ ఫోన్ 1 లాంచింగ్ జూలై 12న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామంటూ కంపెనీ మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అయితే ధర, ఫీచర్లపై అధికారింగా ధృవీకరణ లేనప్పటికీ ఊహాగానాలు ఇలా ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 1 ఫీచర్లు, అంచనాలు
6.55 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
50 + 8 + 2 ఎంపీ ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు
32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ USB టైప్-సి పోర్ట్
ధర సుమారు 534 డాలర్లుగా (రూ. 41,400)ఉండొచ్చని అంచనా. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయానికి రానుంది.
Unlearn. Undo. Starting with phone (1).
Nothing (event) - Return to Instinct.
Tuesday 12 July, 16:00 BST.
Get notified: https://t.co/FEJL4Jb2Aw#phone1 pic.twitter.com/SX0PCdeXw9
— Nothing (@nothing) June 8, 2022