ఇటీవల వారానికి 70 గంటల పని గురించి ప్రస్తావించిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) గురించి తెలిసినన్ని విషయాలు, ఈయన కొడుకు 'రోహన్ మూర్తి' (Rohan Murthy) గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో రోహన్ మూర్తి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నారాయణ మూర్తి వేలకోట్ల సంపాదకు వారసుడైన 'రోహన్ మూర్తి'.. తండ్రి మాదిరిగానే సొంతకాళ్ళ మీద నిలబడాలని కొత్త కంపెనీని ప్రారంభించడానికి ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్ పదవిని వదిలేసాడు. అనుకున్న విధంగానే 'సోరోకో' (Soroco) పేరుతో సంస్థ స్థాపించి కోట్లు గడిస్తున్నాడు.
డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీ అయిన సోరోకో ఆదాయం ఎంత అనేది అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ సంస్థ విలువ 2022లో సుమారు 150 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. అంతే కాకుండా ఈయన ఇన్ఫోసిస్‌లో 1.67 శాతం షేర్లను కలిగి ఉన్నారు.
ఇదీ చదవండి: గూగుల్ కొత్త డొమైన్.. కొనాలంటే రూ. కోటి ఉండాల్సిందే.. ఎందుకింత ఖరీదు!
బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్‌లో చదువుకున్న రోహన్.. ఆ తరువాత కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ (PhD) పొందాడు.
చదువు పూర్తయిన తరువాత 2011లో టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణుని వివాహం చేసుకున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల 2015లో ఈ జంట విడిపోయింది. లక్ష్మి వేణుతో విడాకులైన తరువాత రోహన్ మూర్తి గోల్డ్‌మన్ సాచ్స్, మెకిన్సే వంటి గ్లోబల్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలలో పనిచేసిన 'అపర్ణ కృష్ణన్'ను 2019లో వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment