గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్స్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ సరికొత్త రికార్డును సృష్టించింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది.
రాకెట్ వేగంతో...!
అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజల నుంచి రాకెట్ వేగంతో షేర్ విలువ పెరిగింది. అదానీ గ్రూప్స్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో రూ. 2 లక్షల కోట్లను దాటిన నాల్గవ కంపెనీగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ అవతరించింది. గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ ఈ మైలురాయిని సాధించాయి. దీంతో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10 లక్షల కోట్లు దాటింది. జనవరి 11న బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 5.16 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,844.50కు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.2.02 లక్షల కోట్లకు చేరింది. 2021లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు మూడు రెట్లు పెరిగి 8 శాతానికి పైగా లాభాలను గడించింది.
టాటా గ్రూప్స్ టాప్..!
టాటా గ్రూప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత్‌లోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. టాటా గ్రూప్స్ మార్కెట్ క్యాప్ రూ. 24.27 లక్షల కోట్లుగా ఉంది. ఇక ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 16.65 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కల్గి ఉంది.
చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!
Comments
Please login to add a commentAdd a comment