సాక్షి, ముంబై: ముకేష్ అంబానీ సొంతమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను వెనక్కి నెట్టి ఆగ్ర భాగాన నిలిచింది. క్యూ1ల సాధించిన ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్‌ఐల్ కౌంటర్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రా డేలో 2 శాతానికి పైగా లాభపడింది. మంగళవారం షేరు ధర పెరగడంతో రిలయన్స్ మొత్తం విలువ 7 లక్షల 46 వేల 472 కోట్లకు పెరిగింది. తాజా లాభాలతో దాదాపు 2.7 లక్షల కోట్లను మార్కెట్ క్యాప్‌లో జత చేసుకుంది. జులై 13న తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 7.39 లక్షల కోట్లగా ఉంది.
కాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.9459 కోట్లకు చేరింది. గతేడాది కంటే 17.9 శాతం లాభాలు పెరిగాయి. సంస్థ ఆదాయం 56.5 శాతం పెరిగి 1,41,699 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment