ఐటీసీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది.
ముంబై: ఐటీసీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది. ఐటీసీ కన్నా ముందు వరుసలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ వరుసగా రూ.4,48,272 కోట్లుగా, రూ.3,18,260 కోట్లుగా ఉంది. ఇక ఐటీసీ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.2,58,291 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.2,48,947 కోట్లు) ఉన్నాయి.