కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు | HUL Market Value Tops Rs 5 Lakh Crore For First Time  | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు

Published Tue, Apr 7 2020 3:10 PM | Last Updated on Tue, Apr 7 2020 3:14 PM

HUL Market Value Tops Rs 5 Lakh Crore For First Time  - Sakshi

సాక్షి,  ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)  దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ మంగళవారం దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది.  ఈ వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా అవతరించింది.   గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్  మెగా  ఒప్పందం ప్రకటించిన దాదాపు 15 నెలల విలీనాన్ని మంగళవారం ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించింది.  రూ. 3,045 కోట్ల  విలువైన హార్లిక్స్ బ్రాండ్‌ను కొనుగోలుకు   బోర్డు  అనుమతి లభించందని సంస్థ ప్రకటించింది.  దీంతో హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ ధర 11.41 శాతం పెరిగి రూ .2,399 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది.   (దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు)

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని  అడ్డుకునే క్రమంలో దేశంలో  21 రోజుల లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి  ఎఫ్ ఎంసీజీ ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొన్నాయి. ఇవి వరుసగా 10.4 శాతం, 20 శాతం ఎగిసాయి. అయితే ఈ సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాటం నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో షేర్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.  మంగళవారం నాటి మార్కెట్ లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కోల్‌గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర ఎఫ్‌ఎంసిజి షేర్లు కూడా ఒక్కొక్కటి 5-10 శాతం మధ్య ట్రేడవుతుండటం విశేషం. కీలక సూచీల్లో సెన్సెక్స్ 2289 పాయింట్లకు పైగా లాభపడుతుండగా, నిఫ్టీ 657 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. 

చదవండి: బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది
వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement