దేశీయ మార్కెట్లపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అస్థిరత్వం కలిగి ఉన్నప్పటికీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భారతీయ ఈక్విటీలు చివరి వారంలో భారీ లాభాలను గడించాయి. దాంతో పాటుగా ఉక్రెయిన్ నాటోలో చేరమనే సంకేతాలు, అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో స్టాక్ మార్కెట్స్ మళ్లీ రంకెవేస్తూ లాభాల్లోకి వచ్చాయి. గత వారం స్టాక్ మార్కెట్స్‌లోని టాప్-10 కంపెనీలు భారీ లాభాలను గడించాయి. ఆయా కంపెనీలు మార్కెట్ క్యాప్‌కు సుమారు లక్ష 91 కోట్లను యాడ్ చేసుకున్నాయి.
అత్యంత విలువైన పది షేర్లలో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,91,434.41 కోట్లను అందించడంతో చివరి వారం మార్కెట్లు సహాయపడ్డాయి. లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ టాప్ ప్లేస్‌లో నిలిచాయి. కాగా గత వారం ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కొంత మేర నష్టాలను చవిచూసింది. మార్చి 11 శుక్రవారం రోజున సెన్సెక్స్ 55,550 పాయింట్ల వద్ద , నిఫ్టీ 16,630 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.
► బీఎస్‌ఈలో మార్కెట్ క్యాప్‌లో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.49,492.7 కోట్ల లాభాలను గడించి, అతిపెద్ద కంట్రిబ్యూటర్‌గా నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 16,22,543.06 కోట్లకు చేరుకుంది.
► ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్ మర్కెట్ క్యాప్ వాల్యుయేషన్‌కు వరుసగా రూ.41,533.59 కోట్లు, రూ 27,927.84 కోట్లు పెరిగింది.
► అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్ రూ. 22,956.67 కోట్లను జోడించి దాని మార్కెట్ క్యాప్ రూ.3,81,586.05 కోట్లకు చేరుకుంది.
► ఇక ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.17,610.19 కోట్లను జోడించి రూ.4,92,204.13 కోట్లకు చేరుకుంది .
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువలో రూ.16,853.02 కోట్లను జోడించి రూ. 7,74,463.18 కోట్లకు చేరుకుంది.
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేరెంట్ సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ.2,210.49 కోట్లు పెరిగి రూ.4,04,421.20 కోట్లకు పెరిగింది.
► ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్‌లో రూ.7,541.3 కోట్లను జోడించి రూ. 4,19,813.73 కోట్లకు చేరుకుంది.
► బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.5,308.61 కోట్లు పెరిగి రూ.4,00,014.04 కోట్లకు చేరుకుంది.
► ఐసిఐసిఐ బ్యాంక్ తన మార్కెట్ క్యాప్‌లో రూ. 7,023.32 కోట్లు తగ్గి రూ. 4,71,047.52 కోట్లకు పడిపోయింది .
చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..?
Comments
Please login to add a commentAdd a comment