ఆపిల్‌ సరికొత్త రికార్డ్‌ | Apple tops $800 billion market cap for first time | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ సరికొత్త రికార్డ్‌

Published Wed, May 10 2017 11:20 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఆపిల్‌ సరికొత్త రికార్డ్‌ - Sakshi

ఆపిల్‌ సరికొత్త రికార్డ్‌

అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఆపిల్‌ అరుదైన రికార్డును సొంతంచేసుకుంది. భారీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో తొలిసారి అమెరికాలో టాప్ కంపెనీగా అవతరించింది.

అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఆపిల్‌  అరుదైన రికార్డును సొంతంచేసుకుంది. భారీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో  తొలిసారి అమెరికాలో టాప్ కంపెనీగా అవతరించింది.  మంగళవారం మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు 800 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 53.22 లక్షల కోట్లు) మార్కును తాకి మొట్టమొదటి అమెరికా కంపెనీగా ఆపిల్ ఇంక్  నిలిచింది.   రెండేళ్ల కిత్రం నాటి 700 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 46.56 లక్షల కోట్లు) స్థాయిని  స్వల్పంగా అధిగమించి ఈ ఘనతను సాధించింది.దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సంస్థగా ఆపిల్‌ నిలిచిందిక్లోజింగ్‌ మార్కెట్‌ క్యాప్‌ 802.8 బిలియన్‌డాలర్ల వద్ద ముగిసింది. కాగా అమెరికాలో 50 రాష్ట్రాల్లో 45 లో  దూసుకుపోతోంది.  ప్రధానంగా ఇల్లినాయిస్, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది.ఇందులో ఐ ఫోన్‌  వాటా 33 శాతం పుంజుకుంది. ముఖ్యంగా నవంబర్‌లో అమెరికా ఎన్నికల తర్వాత 50 శాతం లాభాలుపుంచుకున్నాయి. 2012 సెప్టెంబరులో ఆపిల్ అనంతరం ఎస్‌అండ్‌పి 500 యొక్క 4.9శాతం వాటాను కలిగి ఉంది, అయితే ఇండెక్స్ 7శాతం కన్నా ఎక్కువ  సాధించింది.

ఆపిల్‌ ఎంత శక్తివంతైన సంస్థ నిరూపితమైందనీ,  దేశంలో మోస్ట్‌ పవర్‌ ఫుల్ సంస్థగా నిలిచిందనీ న్యూజెర్సీలోని లిబర్టీవ్యూ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రెసిడెంట్‌  రిక్‌ మెక్లర్‌ వ్యాఖ్యానించారు.  మార్కెట్‌లో బలమైన ప్రత్యర్థులు  ఉన్నా,  పరిమిత సంఖ్యలో ఉత్పత్తులను కలిగి  ఉన్నప్పటికీ  మార్కెట్లో నిజంగా ఆధిపత్యాన్ని చాటుకుందన్నారు.

కాగా బిలియనీర్‌  వారెన్ బఫ్ఫెట్ ఆపిల్‌  సంస్థపై తన  ఇష్టాన్ని ఇటీవల మరోసారి ప్రకటించారు.  సంస్థలో సుమారు 20 బిలియన్ డాలర్ల వాటా ఉన్నట్టు వెల్లడించారు. ఐఫోన్  మేకర్ల కాంపిటీటివ్‌  స్థితితోపాటు, వారిని ఫాలో అవుతున్న ఇతర కంపెనీలను   చాలా సులభంగా గుర్తించవచ్చని వ్యాఖ్యానించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement