వాషింగ్టన్: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మంగళవారం రోజున చరిత్ర సృష్టించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,48,50,100 కోట్లు)కు చేరింది. దీంతో అమెరికాలో ఆపిల్ కంపెనీ తరువాత రెండు ట్రిలియన్ క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. మంగళవారం రోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్లు 1.2 శాతాన్ని ఎగబాకాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రస్తుత షేర్ విలువ 266.34 డాలర్ల వద్ద స్థిరపడింది.
2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టినప్పటినుంచి మైక్రోసాఫ్ట్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఏడు సంవత్సరాల నుంచి సత్య నాదెళ్ల రాకతో కంపెనీ షేర్ వాల్యూను పరుగులు పెట్టించారు. అంతేకాకుండా క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగాల్లో ప్రముఖ దిగ్గజ కంపెనీలతో పోటి పడేలా చేశారు. తాజాగా మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు.
అమెరికన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ల బిల్లుల నుంచి తప్పించుకున్న అతిపెద్ద యుఎస్ టెక్నాలజీ కంపెనీలలో మైక్రోసాఫ్ట్ మాత్రమే ఒకటిగా నిలిచింది. దీంతో కంపెనీకి సముపార్జన విషయంలో, ఉత్పత్తి విస్తరణ రెండింటిలోనూ స్వేచ్ఛాను కల్గిస్తుంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త విస్తరణలో భాగంగా కొత్త డేటా సెంటర్‌ను ను స్పెయిన్‌లో ఏర్పాటుచేయనుంది. టెలిఫోనికా కంపెనీ భాగస్వామ్యంతో ఈ డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్..!
Published Wed, Jun 23 2021 7:10 PM | Last Updated on Wed, Jun 23 2021 8:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment