![Kiara Advani Reveals She Calls Juhi Chawla As Aunty - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/20/kiara.jpg.webp?itok=T1WCB8ya)
Kiara Advani Reveals She Calls Juhi Chawla As Aunty: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్నబ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన కియరా ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్న కియరా 'షేర్ షా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ బ్యూటీ పాపులర్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది.
చదవండి: నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కియరా అద్వానీ. ఇందులో స్టార్ హీరోయిన్ జూహీ చావ్లాపై ప్రశంసలు కురిపించింది. తన తండ్రి జగ్‌దీప్ అద్వానీకి హీరోయిన్ చిన్ననాటి స్నేహితురాలని చెప్పుకొచ్చింది. 'జూహీ ఆంటీ మా నాన్న చిన్ననాటి స్నేహితులు. ఆమె చాలా మంచింది. జూహీ ఆంటీ అంటున్నందుకు ఆమె నన్ను చంపేస్తుందని నేను అనుకోవట్లేదు. ఆమెను పెద్ద నటిగా నేను ఎప్పుడూ చూడలేదు. నా పేరెంట్స్‌కు ఫ్రెండ్‌గా మాత్రమే తెలుసు. ఆమె పిల్లలతో కూడా నేను ఆడుకున్నాను.' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అలనాటి నటుడు అశోక్ కుమార్ తనకు బంధువు అవుతాడని తెలిపింది కియరా. 'మా తాతయ్య పెళ్లి చేసుకున్న మా నాన్నమ్మ అశోక్ కుమార్ కుమార్తె. కాబట్టి వీరి పెళ్లి ద్వారా నాకు అశోక్ కుమార్ బంధువు అవుతారు. కానీ నేను ఎప్పుడూ వారిని కలవలేదు.' అని కియరా పేర్కొంది.
చదవండి: లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment