
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేకేఆర్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావల్సిన నేపథ్యంలో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ.. తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
ఆఖరి బంతికి రింకూ సిక్స్ బాదగానే.. కేకేఆర్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తెలిపోయింది. కేకేఆర్ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తమ జట్టు హీరోను భుజాలపై ఎత్తుకుని మరి అభినందిచారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించిన కేకేఆర్ కో ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు విజయం సాధించగానే భావోద్వేగానికి లోనైంది.
ఆమె తన భర్త జే మెహతా, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్‌తో విన్నింగ్ సెలబ్రేషన్స్ జరపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న రింకూ ఒక్క ఫోర్, 6 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 14న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2023: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్?
VENKY & RINKU WERE PHENOMENAL!!! we (@juhisquad & myself) were just as shocked as you @iam_juhi 😭💜 we screamed out loud!!! #KKRvsGT 🔥 pic.twitter.com/OKqRRpgmpX
— juhiloops (@juhiloops) April 9, 2023