PC: IPL.com
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎంతో మంది అనామకులను ఓవర్ నైట్ స్టార్లుగా మార్చేచేసింది. ఇప్పడు మరో యువ క్రికెటర్ ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి స్టార్‌గా ఎదిగాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచానికి తన పేరును పరిచయం చేసుకున్నాడు. అతడే కోల్‌తా నైట్‌రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్. నిన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్ తర్వాత అతడి పేరు మారుమోగుతోంది.
ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ తన పేరు నిలిచిపోయేలా రింకూ అద్భుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా విజయం సాధించాలంటే చివరి 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్ధితిలో కేకేఆర్ విజయం కష్టమేనని అనుకున్నారంతా. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రింకూ వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 21 బంతులు ఎదుర్కొన్న ఈ బ్యాటర్ ఒక్క ఫోర్, 6 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు.
ఇక ఈ స్థాయికి చేరుకున్న రింకూ సింగ్ జీవితంలో ఎంతో కష్టం, బాధ దాగి ఉంది. తన కుటుంబాన్ని పోషేంచేందుకు అతను స్వీపర్‌గా, ఆటో డ్రైవర్‌గా కూడా పని చేశాడు. స్ఫూర్తిదాయక రింకూ సింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...
ఎవరీ రింకూ సింగ్?
25 ఏళ్ల రింకూ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ నిరుపేద కుటంబంలో జన్మించాడు. ఒకానొక సమయంలో తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. రింకూ తండ్రి అలీఘర్‌లో డోర్ టు డోర్ గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని సోదరుడు ఆటో నడుపుతుంటాడు. ఇక ఈ యువ సంచలనం తన జీవితంలో ఒకానొక సమయంలో స్వీపర్‌గా కూడా పని చేశాడు.
రింకూ సింగ్ పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేశాడు. అదే విధంగా రింకూ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వకముందు అలీఘర్‌లోని రెండు గదులున్న ఉన్న ఓ చిన్న ఇంట్లో తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండేవాడు. ఇక 2017లో పంజాబ్ కింగ్స్ తరఫున రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతడికి రాలేదు. అనంతరం 2018 ఐపీఎల్ వేలంలో రింకూ సింగ్‌ను రూ. 80 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ రింకూ జీవితాన్ని మార్చేసింది.
రింకూ సింగ్ జీవిత కథ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు రింకూ సింగ్‌ను కేకేఆర్ విడిచిపెట్టింది. వేలంలోకి వచ్చిన అతడిని మళ్లీ కోల్‌కతానే సొంతం చేసుకుంది. కానీ ఈ సారి అతడిని రూ. 55 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేయడం గమనార్హం.
చదవండి: IPL 2023: మరి నువ్వు మారవా బ్రో.. 13 కోట్లు తీసుకున్నావు! ఇదేనా ఆట?
Rinku Singh has come a long way from a very humble beginnings & deserves the success he gets.#KKRvsGTpic.twitter.com/vo0MBW8vv0
— Cricpedia (@_Cricpedia) April 9, 2023
"Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
Comments
Please login to add a commentAdd a comment