
‘దివానా మాస్తానా’ సినిమాలోని ఓ దృశ్యం
ప్రముఖ బాలీవుడ్ నటి ‘జూహీ చావ్లా’ పుట్టిన రోజు నేడు. శుక్రవారం 53వ పడిలోకి అడుగుపెట్టారామె. 1986 వచ్చిన ‘సుల్తానాత్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు జూహీ. ఇప్పటివరకు 80కి పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగా పలు చిత్రాలను కూడా నిర్మించారు. టెలివిజన్ షోలలో కూడా నటించారు. అప్పటి అగ్ర నటులందరి సరసనా ఆమె హీరోయిన్‌గా చేశారు.. ఒక్క సల్మాన్ ఖాన్‌తో తప్ప. జూహీ హీరోయిన్‌గా నటించిన ‘దివానా మాస్తానా’ సినిమాలో సల్మాన్.. సల్మాన్ హీరోగా చేసిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమా జూహీ గెస్ట్ రోల్స్ చేశారు తప్ప పూర్తి స్థాయి సినిమా అయితే తీయలేదు. ( హద్దులు చెరిపిన ఆకాశం )
దానికి గల బలమైన కారణాలు తెలియకపోయినా గతంలో సల్మాన్ ఆమెపై మనసు పారేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఓ పాత ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ జూహీ అందమైన పిల్ల. ఎంతో మంచిది. తనను నాకిచ్చి పెళ్లి చేయమని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. దానికి కారణం తెలీదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఆమె కెరీర్ ఉచ్చ స్థితిలో ఉండగా 1995లో జై మెహతా అనే వ్యాపార వేత్తను రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జాహ్నవి, అర్జున్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment