
Juhi Chawla Reveals Imran Khan Proposed To Her At Age Of 6: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో నటించి అనేక హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల 5జీ నెట్‌వర్క్‌పై పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జూహీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ముద్దుల మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ పుట్టినరోజు గురువారం (జనవరి 13) జరిగింది. ఈ సందర్భంగా బీటౌన్ ప్రముఖులంతా ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జూహీ కూడా బర్త్‌డే బాయ్‌కు ఆసక్తికరంగా విష్ చేసింది.
1988లో అమీర్ ఖాన్, జూహీ చావ్లా జంటగా నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంలోని ఒక బాబు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బాబు ఎవరో కాదు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. ఆ ఫొటో షేర్ చేస్తూ 'ఆరేళ్ల వయసులో ఇమ్రాన్ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచే ఈ వజ్రాన్ని గుర్తు పెట్టుకున్నాను. నా చిన్నప్పటి భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్ నిండు నూరేళ్లు జీవించాలి.' అని జూహీ రాసుకొచ్చింది. అయితే 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో ఇమ్రాన్ కూడా నటించాడు. 2008లో జెనీలియా దేశ్‌ముఖ్ సరసన ఇమ్రాన్ 'జానే తు యా జానే నా' సినిమాలో తొలిసారిగా నటించాడు. 2015లో కంగనా రనౌత్‌తో కలిసి నటించిన 'కత్తి బట్టి' చిత్రంలో చివరిసారిగా కనిపించాడు ఇమ్రాన్ ఖాన్.
ఇదీ చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం రూ. లక్ష బాండ్‌పై సంతకం
Comments
Please login to add a commentAdd a comment