స్టార్ హీరో ఆర్. మాధవన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే హీరోయిన్ జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి కూడా చెప్పాడట. 1988లో వచ్చిన 'ఖయామత్ సే ఖయామత్ టక్' అనే సినిమా చూశాక ఆమెకు ఫిదా అయిపోయానంటున్నాడు మాధవన్.
జూహీ చావ్లా
ఆ సినిమా చూసి ఫిదా
ప్రస్తుతం ఈ హీరో 'ద రైల్వే మెన్' వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇందులో జూహీ చావ్లా కూడా యాక్ట్ చేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో మాధవన్ మాట్లాడుతూ.. 'అదృష్టం బాగుండి ఈ సిరీస్‌కు జూహీ చావ్లా ఓకే చెప్పారు. ఇక్కడ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. 'ఖయామత్ సే ఖయామత్ టక్' సినిమా చూసినప్పుడు అమ్మ.. నేను ఈ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లాడటమే!' అని చెప్పుకొచ్చాడు. కాగా ద రైల్వే మెన్ సిరీస్‌లో ముందుగా మాధవన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత జూహీ చావ్లాను ఈ సిరీస్‌లో భాగం చేశారు.
భార్య సరితాతో మాధవన్
ఇండస్ట్రీకి పరిచయం
ఇకపోతే 'ఖయామత్ సే ఖయామత్ టక్' సినిమా 1988లో రిలీజైంది. అప్పటికి మాధవన్ తన కెరీర్ ప్రారంభించనేలేదు. అతడు 1993లో 'బనేగి అప్నీ బాత్' అనే టీవీ షో ద్వారా తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు. బుల్లితెరపై పలు షోలలో పార్టిసిపేట్ చేసిన అనంతరం 1997లో 'ఇన్‌ఫెర్నో' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు ఓ బాలీవుడ్ సినిమాలో ఒక పాటలో క్లబ్ సింగర్‌గా కనిపించాడు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ భాషల్లో నటించాడు. ఇతడు 1999లో సరితా బిర్జీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాధవన్ నటించిన పలు సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది.
చదవండి: తెలుగులో ఆ స్టార్ హీరో టార్చర్ పెట్టాడు.. అతడి వల్లే 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరం: నటి
Comments
Please login to add a commentAdd a comment