‘సఫారీ’కి డచ్‌ దెబ్బ | Netherlands achieved a sensational victory | Sakshi
Sakshi News home page

‘సఫారీ’కి డచ్‌ దెబ్బ

Oct 18 2023 2:17 AM | Updated on Oct 18 2023 8:25 PM

Netherlands achieved a sensational victory - Sakshi

దాదాపు ఏడాది క్రితం...టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్యే మ్యాచ్‌...అనూహ్య  ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ కంగుతినిపించింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొన్నప్పటికీ దక్షిణాఫ్రికా సూపర్‌ ఫామ్‌తో వార్‌ వన్‌సైడ్‌గా భావించారు.. నెదర్లాండ్స్‌  27 ఓవర్లలో 112/6 స్కోరు చేయడం చూస్తే అందరూ అనుకున్నట్లే జరుగుతున్నట్లే  అనిపించింది.

అయితే ఇక్కడే సీన్‌ మారింది. మరో సంచలనానికి నాంది పలికే ఇన్నింగ్స్‌తో నాయకుడు ఎడ్వర్డ్స్‌ నడిపించాడు. తర్వాతి 16 ఓవర్లలో మరో 133 పరుగులు జోడించాడు. సారథి పడిన కష్టానికి, చేసిన పోరాటానికి న్యాయం చేసేందుకు బౌలర్లంతా శ్రమించడం పెను సంచలనానికి దారి తీసింది

ధర్మశాల: ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌ సంచలన విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన నెదర్లాండ్స్‌ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (69 బంతుల్లో 78 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్‌ మిల్లర్‌ (52 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కేశవ్‌ మహరాజ్‌ (37 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు.   

ఎడ్వర్డ్స్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌ 
రబడ, జాన్సెన్, ఇన్‌గిడిల బౌలింగ్‌కు నెదర్లాండ్స్‌ టాపార్డర్‌ బదులివ్వలేకపోయింది. విక్రమ్‌జీత్‌ (2), ఒడౌడ్‌ (18), అకెర్మన్‌ (12), బస్‌ డి లీడ్‌ (2), సై బ్రాండ్‌ (19), తేజ (20)... ఇలా ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేదు. అయితే కెప్టెన్ ఎడ్వర్డ్స్‌  కనబరిచిన పోరాటం సంచలనానికి ఓ మెట్టు వేసింది. వాన్‌డెర్‌ మెర్వ్‌ (29)తో 8వ వికెట్‌కు 64 పరుగులు, ఆర్యన్‌ దత్‌ (23 నాటౌట్‌)తో అబేధ్యమైన 9వ వికెట్‌కు 41 పరుగులు ఎడ్వర్డ్స్‌ జతచేశాడు.  

సఫారీ విలవిల 
ఆడేది సులువైన ప్రత్యర్థి తో, ఎదురుగా ఉన్నది స్వల్ప లక్ష్యమే కానీ సఫారీ వల్ల అసాధ్యమైంది. నెదర్లాండ్‌ బౌలర్లు వాన్‌ డెర్‌ మెర్వ్, అకెర్మన్, మెకెరన్, వాన్‌ బీక్, డి లీడే కలిసికట్టుగా పిడికిలి బిగించడంతో...డి కాక్‌ (20), కెప్టెన్ బవుమా (16), హిట్టర్లు డసెన్‌ (4), మార్క్‌రమ్‌ (1) చేతులెత్తేశారు. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాక మిల్లర్‌ కొద్దిగా పోరాడాడు. చివర్లో కేశవ్‌ దూకుడుగా ఆడినా అప్పటికే ఆలస్యమైంది.  

స్కోరు వివరాలు 
నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: విక్రమ్‌జీత్‌ (సి) క్లాసెన్‌ (బి) రబడ 2; మ్యాక్స్‌ ఒడౌడ్‌ (సి) డికాక్‌ (బి) జాన్సెన్‌ 18; అకెర్మన్‌ (బి) కొయెట్జీ 12; బస్‌ డి లీడ్‌ (ఎల్బీ) (బి) రబడ 2; సైబ్రాండ్‌ (సి) జాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 19; తేజ (ఎల్బీ) (బి) జాన్సెన్‌ 20; ఎడ్వర్డ్స్‌ నాటౌట్‌ 78; వాన్‌ బీక్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కేశవ్‌ 10; వాన్‌డర్‌ మెర్వ్‌ (సి) డికాక్‌ (బి) ఎన్‌గిడి 29; ఆర్యన్‌ దత్‌ నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (43 ఓవర్లలో 8 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–40, 4–50, 5–82, 6–112, 7–140, 8–204. బౌలింగ్‌: ఎన్‌గిడి 9–1–57–2, జాన్సెన్‌ 8–1–27–2, రబడ 9–1–56–2, కొయెట్జీ 8–0–57–1, కేశవ్‌ 9–0–38–1.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా (బి) వాన్‌ డెర్‌ మెర్వ్‌ 16; డికాక్‌ (సి) ఎడ్వర్డ్స్‌ (బి) అకెర్మన్‌ 20; వాన్‌డెర్‌ డసెన్‌ (సి) ఆర్యన్‌ (బి) వాన్‌ డెర్‌ మెర్వ్‌ 4; మార్క్‌రమ్‌ (బి) వాన్‌ మెకెరన్‌ 1; క్లాసెన్‌ (సి) విక్రమ్‌జీత్‌ (బి) వాన్‌ బీక్‌ 28; మిల్లర్‌ (బి) వాన్‌ బీక్‌ 43; జాన్సెన్‌ (బి) వాన్‌ మెకెరన్‌ 9; కొయెట్జీ (సి) ఎడ్వర్డ్స్‌ (బి) డి లీడ్‌ 22; కేశవ్‌ (సి) ఎడ్వర్డ్స్‌ (బి) వాన్‌ బీక్‌ 40; రబడ (సి) సైబ్రాండ్‌ (బి) డి లీడ్‌ 9; ఎన్‌గిడి నాటౌట్‌ 7;  ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్‌) 207. వికెట్ల పతనం: 1–36, 2–39, 3–42, 4–44, 5–89, 6–109, 7–145, 8–147, 9–166, 10–207. బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 5–1–19–0, వాన్‌ బీక్‌ 8.5–0–60–3, అకెర్మన్‌ 3–0–16–1, పాల్‌ మెకెరన్‌ 9–0–40–2, వాన్‌ డెర్‌ మెర్వ్‌ 9–0–34–2, బాస్‌ డి లీడ్‌ 8–0–36–2.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement