
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది. చెన్నై వేదికగా పాకిస్తాన్‌తో చివరి వరకు నువ్వా నేనా అంటూ సాగిన మ్యాచ్ లో కేశవ్ మహారాజ్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు . ఈ ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో సాతాఫ్రికా విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ప్రోటీస్ బ్యాటర్లలో మార్‌క్రమ్(91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్ల లో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా ,రవూఫ్ , వసీం , ఉసామ మీర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు . టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలలో బాబర్ ఆజం(50), సౌధ్ షకీల్(52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆఖరిలో షదాబ్ ఖాన్(43), నవాజ్(24) పర్వాలేదనపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షంసీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జానెసన్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ రెండు, లుంగీ ఎంగిడి ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment