స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో ఆడాల్సిందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ , కోహ్లిలకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
"మరో పక్షం రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ్రస్టేలియాతో జరిగే పోరును ఒక ద్వైపాక్షిక సిరీస్‌లా కాకుండా వామప్ మ్యాచ్‌ల తరహాలోనే భారత్ చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. భారత జట్టు ఎంపికను చూస్తే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రోహిత్, కోహ్లి, పాండ్యాలాంటి వారిని పక్కన పెట్టడంతో బ్యాటింగ్ బాగా బలహీనంగా మారిపోయింది. వరల్డ్‌కప్‌కు ముందు జాగ్రత్త కోసం బౌలర్లకు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. స్వదేశంలో గత రెండు వన్డే సిరీస్‌లను కూడా ఆ్రస్టేలియానే గెలుచుకుంది.
అలాంటప్పుడు ప్రపంచకప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌లో గెలిస్తే టీమిండియా మరింత ఉత్సాహంతో ప్రపంచకప్ బరిలోకి దిగేది. సీనియర్లు లేకపోవడం వల్ల ఆ అవకాశం తగ్గిందనేది వాస్తవం. ఇలాంటి సిరీస్‌ను తక్కువ చేసి చూడటం భారత అభిమానులను నిర్ఘాంతపరిచేదే. ఆ్రస్టేలియా జట్టు ప్రపంచకప్ ఫేవరెట్‌లలో ఒకటని అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆసియా కప్ గెలిచిన జోరులో అలాంటి జట్టును భారత్ ఓడిస్తే ఎంతో బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు ఆసీస్ గెలిస్తే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సీనియర్లకు విశ్రాంతినిస్తే ఏం జరిగిందో చూశాం. వరల్డ్‌కప్ జట్టులోకి ఎంపికైన అక్షర్ పటేల్ సమయానికి కోలుకోకపోతే అశి్వన్, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ఈ సిరీస్‌లో బాగా ఆడితే తుది జట్టులో తమ స్థానం కోసం షమీ, శార్దుల్ కూడా పోటీ పడవచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకోవాలి. వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్ కోసం జట్టును సెలక్టర్లు ఎంపిక చేసి ఉండవచ్చు. వచ్చే సోమవారం జరిగే బీసీసీఐ ఏజీఎం సమయానికి ఆసీస్ సిరీస్ గెలవరాదని వారు కోరుకోవాలని గావస్కర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment