లక్నో: మళ్లీ కంగారే! వన్డే వరల్డ్‌కప్‌లో ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ఆ్రస్టేలియా ఈ కప్‌లో ఓ కూనలా విలవిలలాడుతోంది. పసలేని బౌలింగ్, బాధ్యతలేని బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియాకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బవూమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 134 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (106 బంతుల్లో 109; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో కదంతొక్కాడు. మార్క్‌రమ్ (44 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. లబుõÙన్ (74 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, స్టార్క్ (27; 3 ఫోర్లు), కెపె్టన్ కమిన్స్ (22; 4 ఫోర్లు) 20 పరుగులు మించారంతే! రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు.
ఓపెనర్ జోరు...
దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ టాపార్డర్‌తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. జట్టు భారీస్కోరుకు బాటవేశాడు. బవుమా (55 బంతుల్లో 35; 2 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 108 పరుగులు, డసెన్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. 90 బంతుల్లో సెంచరీ పూర్తయ్యాక డికాక్ జట్టు స్కోరు 197 పరుగుల వద్ద నిష్క్రమించాడు.
అనంతరం మార్క్‌రమ్ అర్ధసెంచరీ సాధించడం, క్లాసెన్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు), జాన్సెన్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇలా క్రీజులో వచ్చిన వారంత స్కోరు పెరిగేందుకు దోహదం చేయడంతో సఫారీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 300 పైచిలుకు స్కోరు చేసింది. లంకపై తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసిన సంగతి తెలిసిందే!
కంగారూ... కంగారూ...
జోరు మీదున్న ప్రత్యర్థి, కొండంత లక్ష్యం ముందరుంటే ... మిచెల్ మార్ష్ (7), వార్నర్ (13), స్మిత్ (19)...ఆస్ట్రేలియా టాపార్డర్ స్కోరిది! ఇదికాస్తా 10 ఓవర్లలోపే కంగారూ, బేజారు కలగలిసి ఆసీస్ పరాజయానికి బీజం పడేలా చేసింది.
రబడ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో అప్పటికే అనుభవజ్జుడైన స్మిత్‌ను అవుట్ చేసి తర్వాత జోష్ ఇంగ్లిస్ (5), స్టొయినిస్ (5)లను పట్టుమని పది పరుగులైనా చేయనివ్వలేదు. దీంతో ఆ్రస్టేలియా 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లబుషేన్ నిలబడటంతో ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోరు చేసింది. అంతేగానీ గెలిచేందుకు ఏ దశలో ఆడలేదు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఓడిన ఆ్రస్టేలియా తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం శ్రీలంకతో ఆడుతుంది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) మ్యాక్స్‌వెల్ 109; బవుమా (సి) వార్నర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; డసెన్ (సి) సబ్–అబాట్ (బి) జంపా 26; మార్క్‌రమ్ (సి) హాజల్‌వుడ్ (బి) కమిన్స్ 56; క్లాసెన్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్‌వుడ్ 29; మిల్లర్ (బి) స్టార్క్ 17; జాన్సెన్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 26; రబడ (నాటౌట్) 0; కేశవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 311. వికెట్ల
పతనం: 1–108, 2–158, 3–197, 4–263, 5–267, 6–310, 7–311. బౌలింగ్: స్టార్క్ 9–1– 53–2, హాజల్‌వుడ్ 9–0–60–1, మ్యాక్స్‌వెల్ 10–1 –34–2, కమిన్స్ 9–0–71–1, జంపా 10–0– 70–1, మార్ష్ 1–0–6–0, స్టొయినిస్ 2–0–11–0.
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) బవుమా (బి) జాన్సెన్ 7; వార్నర్ (సి) డసెన్ (బి) ఇన్‌గిడి 13; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రబడ 19; లబుõÙన్ (సి) బవుమా (బి) కేశవ్ 46; ఇంగ్లిస్ (బి) రబడ 5; మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) కేశవ్ 3; స్టొయినిస్ (సి) డికాక్ (బి) రబడ 5; స్టార్క్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 27; కమిన్స్ (సి) మిల్లర్ (బి) షమ్సీ 22; జంపా (నాటౌట్) 11; హాజల్‌వుడ్ (సి) రబడ (బి) షమ్సీ 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్) 177. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–50, 4–56, 5–65, 6–70, 7–139, 8–143, 9–175, 10–177. బౌలింగ్: ఇన్‌గిడి 8–2–18–1, జాన్సెన్ 7–0–54–2, రబడ 8–1–33–3, కేశవ్ 10–0–30–2, షమ్సీ 7.5–0–38–2.
ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X బంగ్లాదేశ్
వేదిక: చెన్నై
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment